తొలిసారి ఓటేసిన యంగ్ ఓటర్ హిమాన్షు.. పరిణతితో మాట్లాడిన కేసీఆర్ మనవడు, తగ్గట్లేదుగా!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ తీర్పును ఈవీఎం బాక్స్ లో భద్రపరిచారు. రాజకీయ సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటేసిన రాజకీయ ప్రముఖులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరైన కొడంగల్ లో ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కుమార్తె నైమిశారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక బి ఆర్ ఎస్ అధినేత కేసిఆర్ సిద్దిపేట జిల్లా చింతమడక లో ఓటు వేయగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో బంజారాహిల్స్ లో ఓటు వేశారు.

ఓటేసిన యంగ్ ఓటర్ హిమాన్షు
అయితే ఈసారి ఓటు హక్కును నమోదు చేసుకోవడంలో ఒక యంగ్ ఓటర్ చూపించిన ఆసక్తి అందరి దృష్టిని ఒకసారిగా ఆకట్టుకుంది. ఆ యంగ్ ఓటర్ మరెవరో కాదు.. కెసిఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు. ఈసారి ఎన్నికలలో తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్న యంగ్ ఓటర్ గా హిమాన్షు నిలిచారు. మొదటిసారి ఓటు వేసినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని హిమాన్షు మీడియాతో మాట్లాడాడు.
మొదటిసారి ఓటు వేసినందుకు తెలియని సంతృప్తి
హైదరాబాద్ లోని నంది నగర్ లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తన తండ్రి కేటీఆర్ తో కలిసి ఓటు వేసిన హిమాన్షు ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మొదటిసారి ఓటు వేయడం తనకు ఏదో తెలియని సంతృప్తి కలుగుతుందని, తన వైపు నుంచికచ్చితంగా సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని అనిపించిందని, అందుకే ఓటు వేశానని తెలిపారు.

ఆ ప్రశ్నలను సున్నితంగా తిరస్కరించిన హిమాన్షు
భారతదేశ రాజ్యాంగం కల్పించిన అరుదైన అవకాశాన్ని వినియోగించుకున్నందుకు తాను గర్వపడుతున్నట్టు హిమాన్షు పేర్కొన్నారు. అమెరికా నుండి ఓటు వేయడానికి తను ఇక్కడికి వచ్చినట్టు చెప్పాడు. అయితే రాజకీయానికి సంబంధించి, పార్టీలకు సంబంధించి పలువురు ప్రశ్నలు సంధించిన క్రమంలో అలాంటి ప్రశ్నలు అడగద్దని సున్నితంగా తిరస్కరించాడు హిమాన్షు.
Telangana: Himanshu Rao, grandson of former Telangana Chief Minister KCR, voted for the first time and thanked the Constitution of India for giving him the right to vote pic.twitter.com/zCikoe9gGU
— IANS (@ians_india) May 13, 2024
తాతకు తగ్గ తనయుడు హిమాన్షు
ఇక హిమాన్షు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా ఉంది. తాత కెసిఆర్ కు తగ్గ మనవడిగా, తండ్రి కేటీఆర్ కు తగ్గ కొడుకుగా హిమాన్షు ధోరణి అందరిని ఆకట్టుకుంది. గొప్ప లీడర్ అవుతాడని అందరూ చెప్పుకునేలా చేసింది.అతనిలో చిన్న వయసులోనే వచ్చిన పరిణతి హిమాన్షు శభాష్ అనేలా చేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications