పీఎం మోదీ ఆపరేషన్ సిందూర్ పై కేసీఆర్, కేటీఆర్ షాకింగ్ స్పందన!
పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై నిన్న రాత్రి భారత సాయుధ దళాలు జరిపిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య 25 నిమిషాల పాటు జరిగింది. పాకిస్థాన్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ ఆపరేషన్ నిర్వహించారు. సియాల్ కోట్లో ని సర్జాల్ క్యాంప్, పాకిస్తాన్లో బహవాల్ పూర్ లో మెహమూనా జోయా, మర్కజ్ తైబా మురిడికే, మర్కజ్ సుభానల్ల అనే ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశారు.
ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సవాయినాలా, ముజఫరాబాద్ లోని సయ్యద్ నా బిలాల్, కోట్లి అబ్బాస్, కోట్లి గుల్ పూర్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. భారత సైన్యం, వైమానిక దళం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో.... భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యూమిక సింగ్, ఆపరేషన్ సిందూర్ తాలూకు వివరాలు తెలియజేశారు.

స్పందించిన కేసీఆర్, కేటీఆర్
పెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులు, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని వారు చెప్పారు. రాత్రి ఒంటిగంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంటన్నర వరకు 25 నిమిషాల పాటు ఈ దాడులు జరిగినట్లు వారు వెల్లడించారు. ఇక భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
వారికి కేసీఆర్ పిలుపు
BRS అధినేత కేసీఆర్ ఆపరేషన్ సిందూర్ పై స్పందిస్తూ, భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా గర్వపడుతున్నానన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో వున్నా, ఏ దేశంలో వున్నా, ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే అనీ, ఉగ్రవాదం అంతం కావాల్సిందేనాన్నారు. ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించే ప్రపంచ శక్తులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ సూచన, కేటీఆర్ చెప్పిందిదే
ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తేనే.. శాంతి సామరస్యాలు నెలకొంటాయని అభిప్రాయపడ్డారు. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆపరేషన్ సిందూర్ పై స్పందిస్తూ, పాకిస్తాన్లోని తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత సైన్యానికి సెల్యూట్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్ట్ లో ఆయన స్పందిస్తూ, ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి మన సేనలకు ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications