హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ భేటీ: క్యాన్సర్ బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్న కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలో క్యాన్సర్‌ రోగులను పరామర్శించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. వారి బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఈ సందర్భంగా తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

గురువారం సాయంత్రం సీఎం తన సొంత ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటి పక్కనే బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు కనిపించారు. దీంతో సీఎం వారిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, వసతి, రాత్రిపూట ఆశ్రయం తదితర అవసరాల గురించి ఆరాతీశారు. రోగుల కుటుంబ స్థితిగతులను ఆయన తెలుసుకున్నారు.

ఇటీవల బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ సచివాలయంలో సీఎం కెసిఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ ఆస్పత్రిలో సేవల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోగుల కోసం చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కోరారు.

హైదరాబాద్‌లో చికిత్సకు వచ్చే రోగుల సహాయకులకు వసతి కల్పించేందుకు ఆశ్రయాలను ఏర్పాటుచేస్తామని ఆయన బాలకృష్ణతో చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ బసవతారకం ఆస్పత్రి రోగులు, వారి బంధువులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

క్యాన్సర్ బాధితులతో కెసిఆర్

క్యాన్సర్ బాధితులతో కెసిఆర్

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలో క్యాన్సర్‌ రోగులను పరామర్శించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

క్యాన్సర్ బాధితులతో కెసిఆర్

క్యాన్సర్ బాధితులతో కెసిఆర్

వారి బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురువారం సాయంత్రం సీఎం తన సొంత ఇంటికి వెళ్లారు.

క్యాన్సర్ బాధితులతో కెసిఆర్

క్యాన్సర్ బాధితులతో కెసిఆర్

ఆయన ఇంటి పక్కనే బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు కనిపించారు. దీంతో సీఎం వారిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు.

కెసిఆర్‌తో బాలకృష్ణ

కెసిఆర్‌తో బాలకృష్ణ

ఇటీవల బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ సచివాలయంలో సీఎం కెసిఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ ఆస్పత్రిలో సేవల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

English summary
Telangana CM K Chandrashekhar Rao on Thursday interacted with Cancer Patients at CM's Old Residence Nandinagar Banjarahills, in Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X