హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ ప్రకటన ఎందుకు చేయలేదంటే? త్వరలో ఆ కీలక ప్రకటన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

అసెంబ్లీ రద్దు పై కే సి ఆర్ కార్యాచరణ ఏమిటి ??

హైదరాబాద్: ప్రగతి నివేదన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతారని దాదాపు అందరూ భావించారు. కానీ కేసీఆర్ వాటి మాటెత్తలేదు. రాజకీయ పరమైన నిర్ణయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మాత్రమే చెప్పారు. మంగళవారం లేదా గురువారం మరోసారి కేబినెట్ భేటీ కానుంది. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

రద్దు ప్రకటన లేకపోవడానికి కారణాలు ఇవే

రద్దు ప్రకటన లేకపోవడానికి కారణాలు ఇవే

కేసీఆర్ అసెంబ్లీ రద్దుపై మాట్లాడకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ సాగుతోంది. అసెంబ్లీని రద్దు చేసే ఉద్దేశ్యం లేదా.. లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చ సాగుతోంది. అయితే, అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించాల్సి ఉందని, మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించి, వాటిని ప్రజలకు దగ్గర చేసిన తర్వాతనే అసెంబ్లీని రద్దు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట.

కేసీఆర్ చెప్పకనే చెప్పారు

కేసీఆర్ చెప్పకనే చెప్పారు


ఇదే అంశాన్ని ఆదివారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కేసీఆర్ తన ప్రగతి నివేదన సభలో చెప్పకనే చెప్పారని చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని నిర్ణయాలు ఉంటాయని ఆయన అన్నారు. దీని ఉద్దేశ్యం.. త్వరలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకొని, ఆ తర్వాత రద్దు చేసే ఉద్దేశ్యమే అంటున్నారు.

అన్ని వివరాలు కావాలని ఆదేశం

అన్ని వివరాలు కావాలని ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా తదితర అన్ని పథకాలతో పాటు, తన మనసులో ఉన్న ఉద్యోగుల మధ్యంతర భృతి, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి తదితరాలపై రేపటి లోగా అన్ని వివరాలు పంపించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలకూ తాయిలాలు ప్రకటిస్తున్న కేసీఆర్... రెండు మూడు రోజుల్లో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు.

 ఆ తర్వాత కీలక ప్రకటన

ఆ తర్వాత కీలక ప్రకటన

దాని తర్వాత అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కొత్త హామీలపై నిర్ణయం తీసుకున్నాక అసెంబ్లీని రద్దు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పలు కీలకాంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీని రద్దు చేస్తే నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లోగా అన్ని శాఖల్లో కేబినెట్‌కు పంపించాల్సిన ఫైల్స్ అందించాలని ఆదేశాలు వెళ్లాయి. దీనిని బట్టి కేసీఆర్ మరో రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు.

English summary
Telangana chief minister K Chandrasekhar Rao on Sunday said he would take a call soon on the dissolution of the state assembly for early elections in the state. The elections are due in April-May next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X