వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! సిగ్గుందా, దెబ్బకు అమరావతిలో పడ్డావ్, మూడో కన్ను తెరిస్తే నీ పని అంతే: కేసీఆర్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

నల్గొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గురువారం నల్గొండ జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో దుమ్మెత్తిపోశారు. బుధవారం నిజామాబాద్‌లోను నిప్పులు చెరిగారు. ఇప్పుడు నల్గొండలో ఏకిపారేశారు.

తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టుకుంటూ కొత్త కుట్రకు తెరలేపారన్నారు. ఇంత నీచాతినీచానికి దిగజారారని విమర్శించారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు సిగ్గులేదా అన్నారు. దిగజారి పొత్తు పెట్టుకున్నారన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన టీడీపీతో పొత్తా అన్నారు.

అడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకంఅడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకం

 చంద్రబాబు తమాషా

చంద్రబాబు తమాషా

చంద్రబాబు నాయుడు నిన్న తమాషా మాటలు మాట్లాడారని కేసీఆర్ అన్నారు. తెలుగోళ్లం ఒకటి అని నేను కేసీఆర్‌కు చెప్పానని, ఇద్దరం ఒకటవుదామని చెప్పానని అన్నాడని, కానీ నేను ఆయన వెంట వెళ్లనందుకే మహాకూటమి వచ్చిందని చెబుతున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. అది మహా కూటమా లేక మహా కూట విషమా అని నిప్పులు చెరిగారు. మహా కూటమా బొంద కూటమా అన్నారు.

చంద్రబాబు! సిగ్గుందా అలా మాట్లాడేందుకు, మోడీ అండతోనే

చంద్రబాబు! సిగ్గుందా అలా మాట్లాడేందుకు, మోడీ అండతోనే

మోడీ, కేసీఆర్ ఒక్కటయ్యారని కూడా చంద్రబాబు అంటున్నారని, అలా మాట్లాడేందుకు సిగ్గుందా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు మోడీ సంకనాకింది నీవు కదా అన్నారు. మోడీ కాళ్లు మొక్కి నా ఏడు మండలాలు గుంజుకున్నది నీవు కదా అన్నారు. మోడీని అడ్డం పెట్టుకొని హైకోర్టు విభజన కాకుండా చేసిందీ నీవు కదా అన్నారు. ఇవన్నీ నిజం కాదా అన్నారు. మోడీ అండతోనే సీలేరు ప్రాజెక్టు ఎత్తుకెళ్లలేదా అన్నారు.

 బిడ్డా.... మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా

బిడ్డా.... మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా

చంద్రబాబువి అన్నీ నంగనాచి మాటలు అని కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. తెలంగాణ దెబ్బతో ఎగిరి విజయవాడలో పడ్డావన్నారు. ఇప్పుడు మా బతుకు మేం బతుకుతున్నామని, మీ తెరవు రాలేదని, ఇక్కడ దుకాణం పెట్టాలనుకున్నావా బిడ్డా.. మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో అని హెచ్చరించారు. నేను మూడో కన్ను తెరిస్తే నీవు ఏమవుతావో అన్నారు.

 చంద్రబాబు పేరు చెబితే దొడ్లోని బర్లు కూడా

చంద్రబాబు పేరు చెబితే దొడ్లోని బర్లు కూడా

తెలుగు వాళ్లమంతా ఒక్కటవుదామని చెప్పి మా కొంపలు ఆర్పినావని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నీ తెలుగు ప్రేమతో తెలంగాణను నాశనం చేశావన్నారు. నీ దుర్మార్గపు పాలనను ప్రజలు మరిచిపోలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే దొడ్లోని బర్లు కూడా తాళ్లు తెంపుకొని పారిపోతాయన్నారు. నువ్వు పెట్టిన బాధల ఎన్నో అని, ఇంకా మాట్లాడటానికి సిగ్గులేదా అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్చి చంపావన్నారు. అలాంటి వ్యక్తితో కాంగ్రెస్ సిగ్గులేకుండా పొత్తు పెట్టుకుందన్నారు.

కృష్ణా కరకట్ట మీద పడ్డావు

కృష్ణా కరకట్ట మీద పడ్డావు

తాను నిమ్స్‌లో చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించానని కేసీఆర్ అన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణను విజయవాడకు అఫ్పగిద్దామా అని ప్రశ్నించారు. రేపు దరఖాస్తుకు పెట్టుకునేందుకు అమరావతి వెళ్లాలా లేదా హైదరాబాద్ వెళ్లాలా అని ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా అన్నారు. చంద్రబాబు ఏమన్నారని, ఎప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తానని అన్నారని వ్యాఖ్యానించారు. ఒక్క దెబ్బ కొడితే కృష్ణా కరకట్ట మీద పడ్డావన్నారు.

చంద్రబాబు బొడ్లోనే కత్తి, నమ్మేవ్యక్తి కాదు

చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని, బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడని కేసీఆర్ చెప్పారు. సిగ్గు, శరం, పౌరుషం లేకుండా చంద్రబాబును కాంగ్రెస్ నేతలు పిలుస్తున్నారన్నారు. రాజకీయాలు అంటే కొందరికి గేమ్ అని, మాకు మాత్రం టాస్క్ అన్నారు. బతుకమ్మ పండుగ కోసం చీరలు ఇధ్దామంటే కాంగ్రెస్ నేతలు ఆడపిల్లల నోటి కాడి కూడు లాక్కున్నారని, తర్వాత ఇస్తామని చెప్పారు. రైతు బంధు చెక్కులు కూడా ఇవ్వవద్దంటే, కోర్టు మొట్టికాయలు వేసిందని, వాటిని రేపటి నుంచి పంచుతామని చెప్పారు.

English summary
Telangana Care taker Chief Minister KCR says Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu thief and traitor. Chandrasekhar Rao Praja Ashirvada Sabha in Nalgonda on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X