వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుని వదలని కేసీఆర్ .. బాబుని బీభత్సంగా తిట్టేశారుగా !!

|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబును వదల బొమ్మాలి అంటున్న కేసీఆర్ || Chandrababu Naidu Is A Narrow Minded Fellow : KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబును వదల బొమ్మాలి అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో మహాకూటమి పేరుతో టీడీపీ పోటీ చేసిన ఖర్మానికి నేటికీ చంద్రబాబును కెసిఆర్ తిట్టిపోస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఏపీలో బాబు ఓటమికి వైసీపీకి అంతర్గతంగా సహకారం అందించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఏ చిన్న అవకాశం దొరికినా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో అధికారం కోల్పోయి, గత ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తిని కన్ను లొట్ట పోయిన చందంగా నానా ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబును మాత్రం కెసిఆర్ వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు.

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించి చంద్రబాబుపై ఫైర్ అయిన సీఎం కేసీఆర్

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించి చంద్రబాబుపై ఫైర్ అయిన సీఎం కేసీఆర్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు విమర్శల వర్షం కురిపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుతో ఏ పని కాదని, గొడవ పెట్టుకోవడం ఆయన నైజమని కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శన సందర్భంగా వనపర్తి జిల్లా ఏదులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి ఆ నీటిని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నామని, ఈ విషయమై ఏపీ సీఎం జగన్, తాను ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు. ఇక అందులో భాగంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా స్నేహపూర్వక వాతావరణంలో ఒప్పందం చేసుకుని ముందుకు వెళుతున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.

చంద్రబాబునాయుడిది చాలా సంకుచిత ధోరణి అన్న సీఎం కేసీఆర్

చంద్రబాబునాయుడిది చాలా సంకుచిత ధోరణి అన్న సీఎం కేసీఆర్

ఇక చంద్రబాబు ని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ తెలివిలేని వాళ్లు కొంతమంది ఏం చేయలేక పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేయలేకపోయారని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వంటి వారికి పని పాట లేదు అని విమర్శించారు. ఎక్కడ ప్రాజెక్టు ఉంటే అక్కడ ‘బస్తీమే సవాల్' అనడం, కోర్టుకు వెళ్లడం, హంగామా చేయడం తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడిది చాలా సంకుచిత ధోరణి అన్న సీఎం కేసీఆర్ చంద్రబాబు బుద్ధి మంచిది కాదని,చంద్రబాబుకు ఎలాంటి గుణమున్నదో ఇతరులకు కూడా అలాంటి గుణమే ఉందని ఆయన భావిస్తారని విమర్శించారు.

గొడవలు పడటం , హంగామా చెయ్యటం తప్ప చంద్రబాబుకు ఏమీ చేతకాదన్న కేసీఆర్

గొడవలు పడటం , హంగామా చెయ్యటం తప్ప చంద్రబాబుకు ఏమీ చేతకాదన్న కేసీఆర్

ప్రతి ప్రాజెక్ట్ విషయంలోనూ చంద్రబాబు గొడవ పడతారని విమర్శలు గుప్పించిన కెసిఆర్ గతంలో బాబ్లీ ప్రాజెక్టు, పరవాడ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు గొడవ పడి సాధించింది ‘గుండు సున్న' అని ఎద్దేవా చేశారు.తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై, మరోపక్క ఏపీ ఎన్నికల్లోనూ చావు దెబ్బ తిని అధికారానికి దూరమై నానా ఇబ్బందులు పడుతున్నా కెసిఆర్ మాత్రం చంద్రబాబు పై విమర్శలను ఏకరువు పెట్టడం ఆపడం లేదు. ఓ పక్క కేంద్రంలోని బీజేపీ, మరోపక్క రాష్ట్రంలోని వైసిపి, ఇంకోపక్క తెలంగాణలోని టిఆర్ఎస్ మూకుమ్మడి దాడి తో చంద్రబాబు విలవిల్లాడుతున్నారు కెసిఆర్ మాత్రం బాబును వదల బొమ్మాలి అంటున్నాడు.

English summary
Speaking about Chandrababu, KCR criticized that some people like chandrababu have not been able to do any construction of the project. Chandrababu Naidu is a narrow minded fellow CM KCR stated .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X