ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ.. సంబంధిత మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు జేఏసీ చైర్మన్ కోదండరామ్. లీకేజీ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్లిప్తతలకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు కోదండరాం.

ఎంసెట్ లీకేజీపై జేఏసీ స్పందించాలన్న డిమాండ్ మేరకు అత్యవసరంగా సమావేశవమైన స్టీరింగ్ కమిటీ ఎంసెట్ 2 లీకేజీతో పాటు, మల్లన్న సాగర్ నిర్వాసితుల అంశంపై చర్చించింది. ఈ సందర్బంగా మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలా సందిగ్దంలో పడి ఉండకపోయేదన్నారు.

నీట్ పైనా, ఎంసెట్ పైనా సందిగ్దత నెలకొన్న సమయంలో..ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎంసెట్ 2 అవసరం ఉండకపోయేదన్నారు కోదండరాం. కార్పోరేట్ సంస్థలపై నియంత్రణ లేకపోవడం, వర్సిటీలకు సరైన వీసీలు లేకపోవడం.. యూజీసీ నిబంధనలకు విరుద్దంగా నియామాకాలను చేపట్టడం వంటి విషయాలపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు కోదండరాం.

సమావేశం సందర్బంగా ప్రభుత్వంపై కోదండరాం చేసిన మరిన్ని కామెంట్స్.. స్లైడ్స్ లో

ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

దొంగలు ఉంటే గింటే.. కేబినెట్ లో ఉండవచ్చు గానీ జేఏసీలో లేరన్నారు కోదండరాం. తాము ఏ దొంగలతో సావాసం చేయడం లేదన్న కోదండరాం.. ఆందోళనలన్నీ నేరుగా జేఏసీయే చేసిందన్నారు.

ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

మల్లన్న సాగర్‌ విషయంలో జేఏసీ నుంచి తొలగించిన దొంగలతో కోదండరామ్‌ కలిసి పని చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన కోదండరాం.. మల్లన్న సాగర్‌ విషయంలో ఇప్పటికీ తాము డీపీఆర్ ను బయట పెట్టాలని కోరుతున్నామని, డీపీఆర్ తోనే ముందుకు పోవాలని ఆయన స్పష్టం చేశారు.

 ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

ఎంసెట్ 2 నిర్వహణ ప్రభుత్వ ప్రతిష్టను పెంచేదిగా ఉండాల్సిందిపోయి.. నిర్లక్ష్య పూరితంగా మారడం శోచనీయమన్నారు కోదండరాం. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి పరీక్షలపై విశ్వసనీయత పెంచాలన్నారు.

ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

ఎంసెట్-2 లీకేజీపై ప్రభుత్వాన్ని కడిగేసిన కోదండరాం.. (ఫోటోలు)

ఇలాంటి ఘటనలతో విద్యా వ్యవస్థలోని పరీక్షలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టడం బాధకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారం పర్యవేక్షణ లోపమే అన్న కోదండరాం.. మనుషుల ప్రమేయం లేకుండా ఉండేలా పరీక్షా పేపర్లు తయారు చేసే విధానం రావాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Professor KodandaRam targeted T sarkar on the issue of Eamcet leakage. He Said govt was completely failed in helding the exam

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X