Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోమటిరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్..! ట్రోలింగ్ పై షాక్..! చంద్రబాబు వద్దకు..!

ఏపీలో తాజాగా కోనసీమ పర్యటనకు వెళ్లి అక్కడ వాలిపోయిన కొబ్బరిచెట్లకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదే క్రమంలో పవన్ సినిమాల్ని సైతం అడ్డుకుంటామంటూ స్వయంగా మంత్రులే హెచ్చరికలు చేస్తుండటంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ వార్నింగ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిపై ట్రోలింగ్ కు దిగుతున్నారు. దీంతో వారికి మంత్రి షాకివ్వబోతున్నారు.

కోనసీమ పచ్చదనానికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు. లేకపోతే తెలంగాణలో పవన్ సినిమాలు ఒక్క థియేటర్ లో కూడా ఆడకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కోమటిరెడ్డిని ఎక్స్ లో టార్గెట్ చేశారు.

komatiredddy Venkat reddy versus pawan kalyan minister complains police on fans trolling

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కోమటిరెడ్డి ఎక్స్ హ్యాండిల్ పై వరుసగా కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి టీమ్ అప్రమత్తమైంది.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేయాలని ఆయన టీమ్ నిర్ణయించింది.

komatiredddy Venkat reddy versus pawan kalyan minister complains police on fans trolling

రెండు రోజులు గా మంత్రిపై ట్విట్టర్ వేదికగా వ్యక్తిగత విమర్శలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానుల ట్విట్టర్ ఎక్స్ ఖాతాదారుల మీద చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీసీఎస్ లో ఆయన టీమ్ ఫిర్యాదు చేయనుంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమరావతికి రానున్నారు. సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కాబోతున్నారు. హైద్రాబాద్ లో నిర్వహించే గ్లోబల్ సమిట్ కు చంద్రబాబును ఆహ్వానించేందుకు ఆయన రాబోతున్నారు. పవన్ తో ముఖాముఖీ పోరు నేపథ్యంలో చంద్రబాబుతో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+