Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి పొంగులేటినీ వదిలిపెట్టని కొండా మురళి.. క్రమశిక్షణా కమిటీ షాకయ్యేలా లేఖ!

కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం పైన నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందు హాజరైన కొండా మురళి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని ఆయన పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని అనుమానిస్తున్న తరుణంలో డిసిప్లినరీ కమిటీ ముందు కొండ మురళి జిల్లా పార్టీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

మంత్రి పొంగులేటిపై కొండా మురళి హాట్ కామెంట్స్
వరంగల్లోని కీలకనేతలపైన, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కొండామురళి తీవ్రఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిపైన, అలాగే వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

konda murali sensational letter before congress Disciplinary committee over minister ponguleti and warangal MLAs

నాడు నియోజకవర్గాల పునర్విభజనలో తనదే కీలక పాత్ర
కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియలో వరంగల్ కు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు అప్పగించగా, వరంగల్ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించేలా నియోజకవర్గాల పునర్విభజన చేయడంలో తనది కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు.

మంత్రి పొంగులేటి సురేఖపై కక్ష సాధిస్తున్నారు
దాని ప్రకారం అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామ సహాయం సురేందర్ రెడ్డి సీటు కోల్పోయారని కక్షతో ప్రస్తుతం ఆయన అల్లుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సతీమణి కొండా సురేఖ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, తాజా పరిణామాలతో అర్థమవుతుందని కొండా మురళి పేర్కొన్నారు. ఇక వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను వెంటబెట్టుకొని వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో తిరుగుతున్నాడన్నారు.

సారయ్య, వేం నరేందర్ రెడ్డిపై కొండా ఆరోపణ
బసవరాజు సారయ్య సురేఖ మీద పోటీ చేసి ఓడిపోయారని కొండా మురళి పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా రామ సహాయం సురేందర్ రెడ్డికి ప్రధాన శిష్యుడు, ఆయన కూడా తమకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ కు చెందిన నాయకులని గతంలో ఆయన కొండ సురేఖ మీద పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు.

కొండా దంపతుల పవర్ చెప్పిన మురళి
ఇక డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు వరకు ఒక ఎలక్షన్ లో కూడా గెలవలేదని, ఆమె తమ డిసిసి ప్రెసిడెంట్ అని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా ఉన్న తాము ఎన్నికల్లో గెలిచామని, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో పాటు వచ్చారని, అది కొండా మురళి, కొండా సురేఖ దంపతుల పవర్ అని మురళి పేర్కొన్నారు.

Take a Poll

కేఆర్ నాగరాజు, మంత్రి సీతక్కతో సంబంధాలపై కొండా మురళి
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కు మద్దతు తెలిపినప్పటికీ ప్రస్తుతం ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలిసి పనిచేస్తున్నారని, అయినప్పటికీ ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. సీతక్క తో ఎటువంటి ఇబ్బంది లేదని, కావాలని సోషల్ మీడియాలో ఆమెతో గ్యాప్ ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారన్నారు.

పరకాల, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు
ఇక పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చి నిలబెడితే, గెలిపిస్తే తమకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని, రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి తనకి సంబంధంలేని వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి మా అధికార పరిధిలోకి చొచ్చుకొని రావడం సహేతుకం కాదు కదా అంటూ ప్రశ్నించారు.

కడియం శ్రీహరిపై ఆరోపణలు
స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి స్థానిక కాంగ్రెస్ పార్టీనేత ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, అయినప్పటికీ ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్వ్ కావడం లేదని, కడియం శ్రీహరి కావాలని చాలామందిని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఎదురు నిలిచి పోరాడింది కాబట్టి ఆమెకు సపోర్ట్ చేసి అన్ని విధాలుగా నిలిచి మద్దతు ఇచ్చామని, ఆమెతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

ప్రజా ప్రతినిధులతో సంబంధాలపై లేఖలో వివరణ ఇచ్చిన కొండా మురళి
డోర్నకల్ ఎమ్మెల్యే నాయక్ నియోజకవర్గంలో తమకు పెద్దగా పట్టులేదని కానీ తమకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి పనులు చేసి పెట్టమంటే చేసి పెడుతున్నామన్నారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులతో తమ సంబంధాలపై తమ లేఖలో కొండా మురళి చాలా స్పష్టంగా పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+