కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు .. ప్రారంభించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ ట్వీట్
కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరుగులు తీశాయి. తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుండి గోదావరి జలాలు కొండపోచమ్మ జలాశయాన్ని చేరుకున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ ను ప్రారంభించారు. మర్కూక్ పంప్‌హౌస్ నుంచి ఈ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో మరొక అద్భుతఘట్టం ఆవిషృతమైంది.

కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం .. అత్యంత ఎత్తుకు చేరిన గోదావరి జలాలు
దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. అంతేకాకుండా భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించబడిన కొండపోచమ్మ రిజర్వాయర్ ఇప్పుడు జలకళతో ఉట్టిపడుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుండి కొండపోచమ్మ సాగర్‌కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.

గంగమ్మకు కేసీఆర్ పూజలు .. గోదావరికి హారతి
సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి కలిసి గంగమ్మకు పూజలు నిర్వహించారు . గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ దంపతులు హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌లో కలిపారు. కొండపోచమ్మ సాగర్‌లోకి నీరు చేరికతో ప్రాజెక్టులోని తుది దశగా చెప్పుకునే 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయని తెలుస్తుంది.
ఇక కొండపోచమ్మ సాగర్ కు వీటిని విడుదల చేస్తూ ఈరోజు సీఎం కేసీఆర్ దంపతులు ప్రారంభోత్సవం చేయడంతో దీనిపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
Recommended Video

సంతోషంలో ట్వీట్ చేసిన కేటీఆర్ .. ఏమన్నారంటే
కెసిఆర్ అంటే కె అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని పేరు సార్థకం కాగా మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపిణీ చేసి భారతదేశంలోనే యంగెస్ట్ సిటీ అయిన తెలంగాణ తన సత్తా చాటుకుంది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మొత్తానికి 5 జిల్లాల వరప్రదాయినిగా నిర్మాణమైన కొండపోచమ్మ రిజర్వాయర్ నేటి నుండి జల సిరులతో కళకళలాడనుంది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications