రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మియాపూర్‌ భూకుంభకోణాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టింది.

ఈ ఆందోళనలో రేవంత్‌రెడ్డి, ఎల్ రమణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు.

Land scam protest: revanth reddy arrested

భూకుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో సీఎం, ఆయన కుటుంబీకులు, అనుచరులపైనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.

ఆందోళనలో పాల్గొన్న రేవంత్ రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఇదేమీ రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ రేవంత్ నినాదాలు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP working committee president Revanth reddy on Monday arrested for protesting against Miyapur land scam.
Please Wait while comments are loading...