హైదరాబాద్! ఢిల్లీలా కాదు: టీ అసెంబ్లీకి ఢిల్లీ డిప్యూటీ సీఎం, ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా ప్రశంసించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీని మనీష్‌సిసోడియా సందర్శించారు.

అనంతరం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మనీష్‌సిసోడియా మాట్లాడుతూ.. తెలంగాణలో టీహబ్ చాలా బాగుందని.. ఢిల్లీలో టీహబ్ ఏర్పాటులో తెలంగాణతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

manish sisodia visits Telangana assembly

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు. అయితే, ఢిల్లీ మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని, పైకి చూస్తే ఆకాశమే కనిపించదని మనీష్ సిసోడియా అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi Deputy CM Manish Sisodia on Wednesday visited Telangana assembly and met minister KT Rama Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి