తెలంగాణా ఫ్యూచర్ స్టేట్.. 31,500 కోట్ల భారీ పెట్టుబడులు; బీఆర్ఎస్ ఏడుపు ఇందుకే!!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పదిహేను రోజులపాటు అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు .ఇక రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చిందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది .విదేశాలలో ఉన్న ఎన్నారైలు పారిశ్రామికవేత్తలను కలిసి వారితో కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు భావిస్తున్నారు.
తెలంగాణాకు పెట్టుబడులు సాధించాం
ఇక రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల ద్వారా సుమారు 31 వేల కోట్లు పెట్టుబడులను ఆకర్షించినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 15 రోజులు పాటు విదేశీ పర్యటన చేశామని, ఈ విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి 31,500 కోట్ల పెట్టుబడులను సాధించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

పెట్టుబడులు తెస్తుంటే కావాలనే దుష్ప్రచారం
ఇదిలా ఉంటే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారం పైన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన తమ పర్యటన ఫ్లాప్ అయిందో సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే కావాలని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
రెండు సార్లు బీఆర్ఎస్ ఫ్లాప్.. అయినా బుద్ధి రాలేదా
మొన్నటి ఎన్నికలలో ఎవరు ఫ్లాప్ అయ్యారో తెలిసిపోయిందని వ్యాఖ్యలు చేశారు. బిఅర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటూ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రెండుసార్లు బీఆర్ఎస్ ఫ్లాప్ అయిన బుద్ధి రాలేదని ఇలాగే మాట్లాడితే మరోసారి ఫ్లాప్ అవడం ఖాయం అని విమర్శలు గుప్పించారు.
ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణా
తెలంగాణ రాష్ట్రంలో అనేక కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ఉండబోతుందని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మన రాష్ట్ర ఆలోచనలను, అభివృద్ధి ప్రణాళికలను, పెట్టుబడులు పెట్టె వారికి ప్రభుత్వం అందించే సహకారాన్ని ఇన్వెస్టర్ లకు చెప్పామని ఆయన తెలిపారు. తమ పర్యటనలో నిమిషం కూడా వృధా చేయకుండా సమయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసమే వినియోగించామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications