Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రాన్ని ఒప్పించి కొత్త రెక్కలు కట్టుకోనున్న తెలంగాణా!

తెలంగాణ రాష్ట్రంలో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు, హైదరాబాదులో బేగంపేట ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఉన్నాయి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని ఎయిర్పోర్ట్ లను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ను కలిసి తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని విమానాశ్రయాలను సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.

వరంగల్ విమానాశ్రయం ఎనిమిది నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్
నేడు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సాధించామని దీంతో వరంగల్ ప్రజల కల నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు .ఈ విమానాశ్రయాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు. 250 ఎకరాలు భూసేకరణకు సంబంధించి ఇప్పటికే నిధులు కూడా కేటాయించిందన్నారు.

Minister komatireddy venkat reddy said about Telangana four new airports along with mamnoor airport

తెలంగాణా లో ప్రతిపాదిత విమానాశ్రయాలను సాధిస్తాం: మంత్రి కోమటిరెడ్డి
ఇక పాత ఒప్పందాన్ని రద్దు చేసుకొని మామునూరు ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇప్పించడానికి జిఎంఆర్ సంస్థను ఎంతో కష్టపడి ఒప్పించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇది మాత్రమే కాదు డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్రయాలను కూడా సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మూడు చోట్ల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి లోను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోను, మహబూబ్నగర్ సమీపంలోని దేవరకొండ లోను గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు .

బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లపై మంత్రి ఏమన్నారంటే
వరంగల్ జిల్లా మామునూరులో, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లు అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లలో ప్రస్తుతం ఉన్న వాటిని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అయితే ఇందులో జక్రాన్ పల్లి, మామునూరు, ఆదిలాబాద్ లో మాత్రమే టెక్నికల్ గా ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ఫీజిబిలిటీ ఉన్నట్టు ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలోనే వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రం కొత్త రెక్కలు కట్టుకొని విహరించేలా ప్లాన్
ఇక మిగతా విమానాశ్రయాల గురించి ప్రస్తావించలేదు, అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను కూడా సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు కేంద్రం పైన పట్టు బిగిస్తామని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నాలుగేళ్లలో పట్టు సడలకుండా ఏర్పాట్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పించేలా కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం కొత్త రెక్కలు కట్టుకొని గగనతలాన విహరించే అవకాశం ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+