ఆరోగ్య సంరక్షణ వికేంద్రీకరణలో ఇది ఒక పెద్ద ముందడుగు: మంత్రి కేటీఆర్!!
తెలంగాణ ఐ టి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని నిత్యం సోషల్ మీడియా వేదికగా చెబుతూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంలోని బీజేపీ తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్తూనే, మరోవైపు తెలంగాణా ప్రగతిని వెల్లడిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి గురించి వెల్లడించారు. ఇప్పటికే అనేక సందర్భాలలో హైదరాబాద్ తర్వాత వరంగల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు వరంగల్ లో నూతనంగా నిర్మాణమవుతున్న 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి చెప్పుకొచ్చారు. వరంగల్ నగరంలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఉద్దేశించి పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్.

వరంగల్ నగరంలో 2000 పడకలతో తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో రాబోతుందని పేర్కొన్నారు. ప్రతి 33 జిల్లాలలోనూ ప్రతీ చోట మెడికల్ కాలేజీ మరియు నర్సింగ్ కాలేజీ తీసుకు రావడం కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ వికేంద్రీకరణ ఒక పెద్ద ముందడుగు అవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Telangana’s Largest Government Hospital with 2,000 Beds at Warangal City is coming up briskly 👍
— KTR (@KTRBRS) April 19, 2023
With a Medical college & Nursing college in each of the 33 districts, this will be a huge step forward in decentralisation of Healthcare
Thanks to CM KCR Garu for his vision of… pic.twitter.com/bBWjo73gJ0
ఆరోగ్య తెలంగాణ విషయంలో సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ పేర్కొన్న మంత్రి కేటీఆర్ సీఎం కెసిఆర్ విజన్ కు ఇది నిదర్శనమన్నారు. ట్విట్టర్ వేదికగా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఫోటోలను, ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్న తీరుకు సంబంధించి ఫోటోలను పోస్ట్ చేసిన కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరితగతిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

ఇక మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు నెటిజన్లు స్పందిస్తున్నారు. కేసీఆర్‌గారి దార్శనికత మరియు అభివృద్ధి రెండు ఆరోగ్య తెలంగాణ సాధనలో కనిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దశాబ్దాలుగా 4 పాత జిల్లాల చుట్టూ ఉన్న సంజీవని లాంటిదని చెబుతూనే, ఈ కొత్త అతిపెద్ద ఆసుపత్రి వరంగల్ నుండి మెరుగైన వైద్య సేవలను అందిస్తుంది అని కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications