వరంగల్ లో కేటీఆర్ పర్యటన టెన్షన్ .. బీజేపీ, కాంగ్రెస్ నేతల అరెస్టులు, హౌస్ అరెస్టులు!!

వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అరెస్టులు చేస్తున్నట్లుగా వెల్లడించారు.దీంతో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

మంత్రి కేటీఆర్ ను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు వారిపై నిఘా ఉంచారు. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులను సైతం అరెస్టు చేస్తున్న పోలీసులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంటూ అరెస్టులకు పాల్పడుతున్నారు.దీనిపై బిజెపి, కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 ktr

మంత్రి కేటీఆర్ ఎప్పుడు వచ్చినా పోలీసులు అక్రమంగా తమను అరెస్టు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ పరిధిలో ,వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిని సైతం పోలీసులు గృహనిర్బంధం చేయగా ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటించే జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించాలని పోలీసు అధికారులపై మండిపడుతున్నారు. మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులు చేయడానికి వస్తే ప్రతిపక్ష నాయకుల అరెస్టు చేయడం దేనికి అంటూ వారు మండిపడుతున్నారు.

ఓరుగల్లులో అనేక సమస్యలు ఉన్నాయని వాటి గురించి ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చెయ్యటం కేవలం భయంతోనే అని చెప్తున్నారు. ఈ నిరంకుశ వైఖరికి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణ పాఠం చెప్పి తీరుతారని వారు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+