మంత్రి కేటీఆర్ యూకే, యూఎస్ పర్యటనలు: 42వేల మందికి ఉద్యోగాలు; హ్యాట్సాఫ్ కేటీఆర్!!

మంత్రి కేటీఆర్.. మంచి విజన్ ఉన్న లీడర్.. ప్రపంచ దేశాలలోని దిగ్గజ సంస్థలను తెలంగాణాలో పెట్టుబడులు పెట్టించే మంచి క్యాలిబర్ ఉన్న నాయకుడు. తాజాగా రెండు దేశాల్లో రెండు వారాల పాటు పర్యటించిన కేటీఆర్ రెండు వారాల పర్యటనలోనూ బిజీ బిజీగా గడిపారు. యూకే, యూఎస్ లలో పర్యటించిన కేటీఆర్ 80కి పైగా బిజినెస్ సమావేశాలలోనూ, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలలలోనూ, రెండు అంతర్జాతీయ సదస్సులలోనూ పాల్గొన్నారు.

రెండు ప్రపంచ సదస్సులలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంలో, 42 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంలో చేసిన కృషి నిరుపమానమైనది. యూకే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ లండన్ లో పర్యటించారు.

 ktr

ఇటు యూఎస్ లో న్యూయార్క్, వాషింగ్టన్ డిసి , హోస్టన్, హెండర్సన్, బోస్టన్ లలో పర్యటించిన కేటీఆర్ అక్కడ దిగ్గజసంస్థలతో భేటీ అయ్యారు. వివిధ రంగాలకు సంబంధించిన వ్యాపారవేత్తలతో భేటీ అయిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఐటి,ఐటీఈఎస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఏరోస్పేస్, మెడికల్ డివైసెస్, ఇన్నోవేషన్, డేటా సెంటర్స్, ఆటోమోటివ్ అండ్ ఈవీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, భీమా తదితర రంగాలనుంచి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు.

రెండు ప్రపంచ సదస్సులలోనూ తెలంగాణ ఘనకీర్తిని చాటిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలను భారత ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని వెల్లడించారు. అంతేకాదు ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ లో పాల్గొని కాళేశ్వరం మరియు మిషన్ భగీరథ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణా విజయాలను వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడానికి కేటీఆర్ ఎంతగానో కష్టపడ్డారు. తన ప్రయత్నంతో 42 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి అని అది తనకు ఎంతో ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.

 ktr

42 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు మాత్రమే కాకుండా అంతకు మూడింతలు పరోక్ష ఉద్యోగావకాశాలు కూడా లభించనున్నాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్ . తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పెట్టుబడుల విషయంలో ఆపరేషన్ ఆకర్ష నిర్విఘ్నంగా కొనసాగుతుంది అని చెప్పడానికి యూకే, యూఎస్ పర్యటన ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

ఇక తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ, దిగ్గజ కంపీనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ సాగిన కేటీఆర్ పర్యటన పట్ల, ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన చేస్తున్న అవిరళకృషి పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్సాఫ్ కేటీఆర్ అంటూ కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+