బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ చేసింది కవితనే
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి, ఢిల్లీలో కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ఇరుక్కోవడం, ఆమెను అరెస్టు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జైలుకు పంపడం, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు బిఆర్ఎస్ పార్టీకి ఊపిరాడనివ్వడం లేదు.
బీఆర్ఎస్ బలహీనం అయ్యింది ఇందుకే
ఇక ఈ కేసు నుండి కవితను బయటకు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం కూడా పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు కారణంగా మారింది. కవిత అరెస్టు తర్వాత పార్టీ నుండి ఇతర పార్టీలకు వలసలు కూడా బాగా పెరిగిపోయాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి తాజాగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఇంత బలహీనపడిపోవడానికి కవిత కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ ప్రభావం
జనగామ జిల్లాలో కడియం కావ్య కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కడియం శ్రీహరి కెసిఆర్ కుమార్తె కవిత పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లడం, కనీసం ఆమెకు బెయిల్ కూడా దొరికే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో పార్టీ బలహీన పడిందని, ఆ పార్టీలో కొనసాగితే ఎవరిపైన ఏ కేసు నమోదు అవుతుందో అన్న ఆందోళన కూడా రాజకీయ నాయకుల్లో ఉందని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబ దోపిడీ
గత పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ కారణంగా ఇప్పుడు పార్టీ ఇబ్బంది పడుతుందన్నారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. కెసిఆర్ కుటుంబం భూకబ్జాలకు పాల్పడిందని కడియం శ్రీహరి ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ ఇందువల్లే
గత అసెంబ్లీ ఎన్నికలలో గ్రామాలను అభివృద్ధి చేస్తానని తాను మాట ఇచ్చానని, ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమయ్యానని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కవిత వ్యవహారమే బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ చేసిందని అన్నారు కడియం శ్రీహరి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications