మునుగోడు వార్: అధిష్టానానికి క్షేత్రస్థాయి నివేదికలు; బండి సంజయ్ కు బీజేపీ హైకమాండ్ పిలుపు!!

కేంద్రంలోని బిజెపి అధినాయకత్వం మునుగోడు ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. మునుగోడు ఉపఎన్నిక భవిష్యత్తు ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తుందన్న భావనలో ఉన్న బిజెపి అధినాయకత్వం మునుగోడును హస్తగతం చేసుకోవడానికి రాష్ట్రస్థాయి నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంది.

 మునుగోడు ఉప ఎన్నిక.. క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకుంటున్న బీజేపీ హై కమాండ్

మునుగోడు ఉప ఎన్నిక.. క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకుంటున్న బీజేపీ హై కమాండ్

మునుగోడు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై, ఉప ఎన్నికల ప్రచార సరళి పై దృష్టిసారించిన బిజెపి అధినాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మునుగోడు ఉప ఎన్నికల్లో విజయావకాశాలు ఏవిధంగా ఉన్నాయి వంటి అనేక అంశాలపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు పార్టీ పనితీరుపై బిజెపి అధినాయకత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీతో సంబంధం లేని స్వతంత్ర సంస్థలతో, బృందాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివేదికలు తెప్పించుకొని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ రావాలని పిలుపు.. కీలక చర్చ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఢిల్లీ రావాలని పిలుపు.. కీలక చర్చ

ఈ క్రమంలోనే తాజాగా క్షేత్రస్థాయిలో నివేదికల ఆధారంగా తెలంగాణాలో చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళిక రూపొందిస్తున్న బీజేపీ అధినాయకత్వం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను హస్థినకు రావాలని ఆదేశించారు. ఈ క్రమంలో నేడు, రేపు బండి సంజయ్ ఢిల్లీలో జాతీయ స్థాయి ముఖ్య నాయకులను కలుసుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఎలా చేస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుంది? ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇతర లోటుపాట్ల పై బిజెపి అధినాయకత్వంతో బండి సంజయ్ చర్చించనున్నారు.

మునుగోడు ఉపపోరుపై బండి సంజయ్ కు అధినాయకత్వం కీలక సూచనలు ..

మునుగోడు ఉపపోరుపై బండి సంజయ్ కు అధినాయకత్వం కీలక సూచనలు ..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల పై మునుగోడు ఎన్నికల ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలోనే జాతీయ నాయకత్వం ఎక్కువగా మునుగోడు ఉప ఎన్నిక పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయిలలో నాయకులు పనితీరు, పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న తీరు, పార్టీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఎన్నికల ప్రచార ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది? వంటి అనేక అంశాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడానికి బిజెపి అగ్రనేతలు బండి సంజయ్ ను ఢిల్లీకి రావాలని పిలిచినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ జాతీయ ముఖ్య నాయకులతో కీలక భేటీలలో పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+