సుమకు చెంపదెబ్బలు అవసరం: బాలకృష్ణ షాక్.. సుమకు ఫ్యూజులు ఔట్!!

రసమయి ఫిలిం ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జగపతిబాబు నటించిన రుద్రంగి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యాంకర్ సుమ, జగపతి బాబు సినిమా విషయంలో చూపించిన కమిట్మెంట్ ను పొగుడుతున్న సమయంలో ముఖ్య అతిథిగా ఉన్న బాలకృష్ణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ ఒక్కసారిగా సుమను ఆపి, మాట్లాడటం మానేసి మైక్ పాస్ చేయమన్నారు. హే ఆపు.. ఓ లొడ లొడా వాగుతూ ఉంటావంటూ సుమన్ విసుక్కున్న బాలయ్య.. అంతకు ముందు సుమ మాట్లాడేటప్పుడు నేను చెప్పకుండా మీరంతా చప్పట్లు కొడతారా అని అన్నట్టు పేర్కొని అప్పుడప్పుడు ఈవిడకు చెంపదెబ్బలు పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Nandamuri Balakrishna

ఇక ఆపై ఇంకో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని పేర్కొన్న బాలకృష్ణ ఆవిడ చెప్పుదెబ్బలు కొట్టే అవకాశం కూడా లేకపోలేదని వ్యాఖ్యానించారు. బాలయ్య వ్యాఖ్యలకు అవాక్కయిన సుమకు ఏం చేయాలో అర్థం కాలేదు. సుమ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, కళ్ళు ఒకింత పెద్దగా చేసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని సందిగ్ధతకు లోనయింది.

ఇక ఆపై సుమపైనే బాలయ్య మళ్లీ వ్యాఖ్యలు చేశారు. పాపం రాజీవ్ కనకాల సుమ ని ఎలా భరిస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక బాలకృష్ణ మాట్లాడుతున్న క్రమంలో బాలయ్య బాబు సెక్సీ అంటూ ఫ్యాన్స్ గోల చేశారు. దీంతో బాలయ్య స్పందిస్తూ నేను సెక్సీ ఏంటి.. సుమ, విమలారామన్, మమతా మోహన్ దాస్ వింటే జెలస్ ఫీల్ అవుతారు అంటూ బాలయ్య బాబు ఫన్నీ కామెంట్స్ చేశారు.

Nandamuri Balakrishna

అవునా కాదా అంటూ సుమను ప్రశ్నించారు. సుమ అవునన్నట్టు తలూపింది. పోరి హుషారుగుందిరోయ్ అంటూ సుమ పై బాలయ్య పాట కూడా పాడారు. మొత్తానికి సుమను ఒక ఆటాడుకున్న బాలయ్య యాంకర్ సుమ పైనే బోలెడు పంచ్ లు వేశారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా సరదా సంభాషణలతో సాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+