Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా.. కేసీఆర్ పుట్టినరోజున లేనట్టే!!

కొత్త సచివాలయ ప్రారంభోత్సవ వేడుక వాయిదా పడినట్టు సమాచారం . కొత్త సచివాలయ ప్రారంభం కేసీఆర్ పుట్టినరోజున జరగదని తెలుస్తుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజున తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నప్పటికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. రాత్రింబవళ్ళు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు గుర్తుగా ప్రారంభించాలి అని భావిస్తే అది నెరవేరటం లేదు.

సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

పాత సచివాలయం పనికిరాదని దానిని కూల్చి దాదాపు 617 కోట్ల రూపాయలతో కనివిని ఎరుగని రీతిలో అద్భుతంగా సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతమైన ఈ భవనాన్ని ప్రారంభించడానికి ఫిబ్రవరి 17వ తేదీన ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇంతకుముందు సంక్రాంతి పండుగకి నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించినా అది సాధ్యం కాలేదు. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ పుట్టినరోజు నాడు నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నా ఇది కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్... ఎన్నికల కోడ్..

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్... ఎన్నికల కోడ్..

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లోకి రావడంతో, ఎలక్షన్ కోడ్ కారణంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడినట్టుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైంది. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆపై ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్ ల ఉపసంహరణ ఉంటుంది.

కేంద్ర ఎన్నికల సంఘంతో సీఎస్ సంప్రదింపులు.. వాయిదా నిర్ణయం

కేంద్ర ఎన్నికల సంఘంతో సీఎస్ సంప్రదింపులు.. వాయిదా నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడిందని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ మేరకు ఈ నెల 17 న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. వారినుంచి వచ్చిన ప్రతి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో.. ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్థుతానికి వాయిదా వేయడం జరిగింది. తదుపరి తేదీని తిరిగి ప్రకటించడం జరుగుతుంది.

కేసీఆర్ పుట్టినరోజున సచివాలయ ప్రారంభంపై రాద్దాంతం

కేసీఆర్ పుట్టినరోజున సచివాలయ ప్రారంభంపై రాద్దాంతం

ఇప్పటికే సంక్రాంతికి నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని బి ఆర్ ఎస్ సర్కార్ మొదట భావించినప్పటికీ అప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో పాటు జనవరి 18వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తర్వాత దానిని కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానిపైన ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. కెసిఆర్ సొంత డబ్బులతో నిర్మించినట్టుగా ప్రజల సొమ్ముతో కట్టిన తెలంగాణ సచివాలయాన్ని కెసిఆర్ పుట్టినరోజు ఎందుకు ప్రారంభించాలంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో సచివాలయ ప్రారంభం వాయిదా

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో సచివాలయ ప్రారంభం వాయిదా

కేసీఆర్‌ పుట్టినరోజు నాడే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ హైకోర్టులో పిల్‌ కూడా దాఖలు చేశారు. తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని గొప్పలు చెబుతున్న కేసీఆర్ అంబేద్కర్ పుట్టినరోజున సచివాలయాన్ని ప్రారంభించాలని పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుండి డిమాండ్ వినిపించింది. ఇక ఈ వివాదం కొనసాగుతుండగానే సడన్ గా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎంతో ఘనంగా ప్రారంభించాలి అని భావించిన తెలంగాణా నూతన సచివాలయ ప్రారంభోత్సవం మరో మారు వాయిదా పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+