కొరియర్ బాయ్స్ గెటప్ .. మహిళల మంగళ సూత్రాలే టార్గెట్ .. కొత్తరకం చైన్ స్నాచింగ్స్
చైన్ స్నాచర్లు రూటు మార్చారు. నిన్నటి వరకు నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో చైన్ లాకెళ్ళే ముఠా ఇప్పుడు దర్జాగా ఇళ్లలోకే చొరబడి మహిళల మెడలో ఉన్న గొలుసులను తస్కరిస్తున్నారు . కొరియర్ బాయ్స్ గా ఇంట్లోకి చొరబడి ఓంటరిగా ఉన్న మహిళల మంగళసూత్రాల లాక్కెళ్తున్నారు. ఈ తరహా చైన్ స్నాచింగ్ తో నిజామాబాద్ జిల్లాలో ప్రజలు కొరియర్ బాయ్స్ అంటే భయపడుతున్నారు.

కొరియర్ బాయ్స్ పేరుతో చోరీలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. జిల్లాలో వారం వ్యవధిలో కొరియర్ బాయ్స్ పేరిట ఇళ్ళకి కొరియర్ వచ్చిందని వెళ్తున్న కేటుగాళ్ళు, చొర శిఖామణులు రెండు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు . వారం క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి చైన్ స్నాచర్లు పుస్తెలతాడు తెంపుకుని పారిపోయారు. ఈ ఘటన మరువక ముందే ఇద్దరు సభ్యుల ముఠా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

మహిళల మంగళ సూత్రాలే టార్గెట్ గా చోరీలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న పద్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డ చైన్ స్నాచర్ తనను కొరియర్ బాయ్ గా పరిచయం చేసుకుని అడ్రస్ అడిగినట్లు నటించి పుస్తెల తాడు లాక్కెళ్లాడు. సినీ ఫక్కిలో ఈ ఘటన జరగడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. కొరియర్ బాయ్స్ గా వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడటం, ఇంటి ఆవరణలో కారం పొడి చల్లటం కొత్తతరహా దొంగతనంగా పోలీసులు పేర్కొంటున్నారు.

చోరీలకు పాల్పడుతుంది ఒకటే ముఠానా .. లేకా రెండు ముఠాలా
చోరీ జరిగిన తీరు పై బాధితులు ఆందోళన చెందుతున్నారు కామారెడ్డిలో అపాచీ ద్విచక్ర వాహనంపై చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ముఠా నిజామాబాద్ గాయత్రి నగర్ లో కొరియర్ బాయ్స్ గా మంగళసూత్రం ఎత్తుకెళ్లిన ముఠా ఒక్కేటనా వేర్వేరా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. వేర్వేరు తరహాలో చైన్ స్నాచింగ్ జరిగినప్పటికీ కామారెడ్డి, నిజామాబాద్ లో చోరీకి పాల్పడింది ఇద్దరు సభ్యుల ముఠా అని పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల కోసం పోలీసుల గాలింపు.. అప్రమత్తంగా ఉండాలని సూచన
కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న మహిళలు తాజాగా కొత్త తరహాలో చైన్ స్నాచింగ్ లు జరపడం పట్ల భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది . ఇక కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులు ఎవరైనా అనుమానస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడిన వారిని ఇంకా పోలీసులు పట్టుకోలేకపోయారు . త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్తున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు .
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications