హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లేడీ టెక్కీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్టువేర్ ఇంజినీర్ రీనా ఆత్మహత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. రీనాను ప్రేమించిన డేనియల్ పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. అతను స్వయంగా లొంగిపోయేందుకు సిద్ధం కావడం గమనార్హం.

ఈ సందర్భంగా అతను ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడాడు. తాను రీనాను అయిదేళ్లుగా ప్రేమించానని, ఆమె చనిపోయిందని తెలిసి తన మైండ్ బ్లాక్ అయిందన్నాడు. ఈ రెండు రోజుల పాటు తాను బయటనే తిరిగానని చెప్పాడు. రీనా మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. రీనాను తాను ప్రేమించానని, ఆమె తప్పు చేసినా నేనే క్షమాపణ చెప్పాలన్న మనస్తత్వం ఆమెది అని చెప్పాడు.

ప్రేమ వ్యవహారంలో మనస్పర్థల కారణంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రీనా రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సికింద్రాబాదులోని మల్కాజిగిరి మౌలాలి తిర్మల్‌ నగర్‌కు చెందిన రీనా సిల్వియా రిచర్డ్‌సన్‌(23) డిలైట్‌ కంపనీలో(హెచ్‌ఆర్‌) పని చేస్తున్నారు.

New twist in Lady techie suicide case

ఈమెకు కళాశాల నుంచి స్నేహితుడైన మేడిపల్లికి చెందిన డేనియల్‌తో పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది. ఐదేళ్ల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. డెన్జిల్‌ రీనా పనిచేసే సంస్థలోనే ఉద్యోగం చేస్తున్నాడు.

ఆదివారం రాత్రి డేనియల్ కుటుంబ సభ్యులు, రీనా మధ్య గొడవ జరిగినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అదే రోజు రాత్రి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఘర్షణ అనంతరం రీనా ఇంటికి వచ్చేసింది. మనస్తాపం చెందిన ఆమె సోమవారం చున్నీతో ఉరేసుకుంది.

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. రీనా తల్లి మేరీజాన్‌ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో రీచా వివాహం విషయమై డేనియల్‌తో మాట్లాడగా తప్పించుకు తిరుగుతున్నాడని చెబుతున్నారు. దీంతో ఆదివారం అతడి ఇంటికి వెళ్లిన రినాను డేనియల్ తల్లిదండ్రులు సునీత, బిషప్ రావు దూషించారు. దీంతో రీనా మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆమె తల్లి మెరీజాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసుల ఎదుట లొంగిపోయాడు

రీనా ఆత్మహత్య కేసులో నిందితుడు బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను రీనాను మోసం చేయలేదని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పినా రీనా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదన్నాడు. తన ఆత్మహత్యకు ప్రియుడు కారణమని రీనా సూసైడ్ నోట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

English summary
New twist in Hyderabad Lady techie Reena suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X