జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఝలక్; బరిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి; షాకింగ్ ఆడియో!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారు వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి చాలామంది ఆశావహులైన నాయకులు తనదైన శైలిలో లాబీయింగ్ కొనసాగిస్తున్నారు. అయితే వివిధ సర్వేల ఆధారంగా, ప్రజల్లో ఎమ్మెల్యేకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని టిక్కెట్లు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది.
ఇటీవల కాలంలో జనగామలో కూతురుతో అనేక వివాదాల నేపధ్యంలో తీవ్రమైన దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వబోరని ప్రధానంగా చర్చ జరుగుతుంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెరువు భూములను కబ్జా చేశారని స్వయంగా కూతురే ఆరోపించడం, తండ్రి పైన కేసులు పెట్టడం, ఇంకా ఎందుకు రాజీనామా చేయడం లేదంటూ తండ్రిని నిలదీయటం వంటి పరిస్థితులు ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టాయి.

జనగామ జిల్లాలో ముత్తిరెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడినుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతారని చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో జనగామ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని సమాచారం.
ఇక ఇదే విషయమై నర్మెట్ట జడ్పిటిసి మా లోతు శ్రీనివాస్ తో, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఇటీవల ఫోన్లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి అయితే ఈసారి జనగామ ఎన్నికల బరిలో తాను ఉంటానని నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ చేసినట్టు ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
తాజా పరిణామాలతో జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ అంటున్నారు. ఇదే గనుక జరిగితే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పెద్ద షాక్ తగిలినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications