సీఎం అని నినాదాలు, సన్నిలియోన్-పవన్‌లలో ఎవర్ని హగ్ చేసుకుంటారని ఫ్యాన్స్‌కు వర్మ

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ నేతలు వచ్చారు.

Recommended Video

    సన్నీ లియోన్‌, పవన్ కళ్యాణ్ ప్రజలకి వేరు వేరు సుఖాలు ఇచ్చారు

    హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, మీడియా హెడ్ హరిప్రసాద్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.

    చదవండి: మై ఎవ్రీడే హీరో బంగ్లాదేశ్ హకీమ్: ఎందుకో చెప్పిన పవన్, రాజకీయంగా విలువైన సూచనలు

    పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు

    పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు

    పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకొని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. పవన్ కనిపించగానే అభిమానులు, కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 'సీఎం.. సీఎం' అంటూ వారు నినాదాలు చేశారు.

    మౌనంగా పవన్ కళ్యాణ్ ముందుకు

    మౌనంగా పవన్ కళ్యాణ్ ముందుకు

    పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. వారిని అదుపు చేసేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అభిమానులు నినాదాలు చేస్తుండగా పవన్ కళ్యాణ్ మౌనంగా అక్కడి నుంచి ముందుకు కదిలారు.

    ఓ పోస్ట్ పెట్టిన జనసేన

    ఓ పోస్ట్ పెట్టిన జనసేన

    అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ ప్రతినిధులతో తన లండన్ పర్యటన వివరాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించి జనసేన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

    రామ్ గోపాల్ వర్మ మళ్లీ

    రామ్ గోపాల్ వర్మ మళ్లీ

    పవన్‌ను చూసేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. దీనిని కూడా వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ వదలలేదు. పవన్‌కు, సన్ని లియోన్‌కు ముడిపెడుతూ కామెంట్ పెట్టారు. పవన్, సన్నీ లియోన్ ఇద్దరూ క్రౌడ్ పుల్లర్స్ అని, వారిద్దరు జనసేన/జనసే

    రామ్ గోపాల్ వర్మ వరుస పోస్టులు, పవన్ ఫ్యాన్స్‌కి ప్రశ్న

    రామ్ గోపాల్ వర్మ వరుస పోస్టులు, పవన్ ఫ్యాన్స్‌కి ప్రశ్న

    అంతకుముందు కూడా పోస్టులు పెట్టారు. 'పవన్ కళ్యాణ్ కి ఉన్న లక్షల fans కి Sunny Leone కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఒకరికే hug ఇచ్చే chance ఇస్తే ఎవరిని hug చేస్కుంటారా అన్నది పవన్ కళ్యాణ్ fan గా నా ప్రశ్న', 'వచ్చే ఎలక్షన్ లలో Sunny Leone పవన్ కళ్యాణ్ alliance అనేది extraordinary political strategy అవుతుందని నా ప్రఘాడ నమ్మకం ...ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకి వేరు వేరు entertaining సుఖాలు ఇచ్చారు', 'Sunny Leoneకి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ crowd gather అవుతున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం' అంటూ వరుస పోస్టులు పెట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+