కేటీఆర్-నేను రాజకీయాలు సహా ఎన్నో విషయాలు మాట్లాడాం: పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ధన్యవాదాలు తెలిపారు. తన తాజా చిత్రం కామరాయుడును అభినందించినందుకు థ్యాంక్స్ చెప్పారు.

'కాటమరాయుడు'కు కేటీఆర్ కితాబు, 2019 సీఎంలు..

అదే సమయంలో కేటీఆర్‌తో తాను కలిసిన సందర్భంగాన్ని గుర్తు చేసుకున్నారు. తామిద్దరం ఎన్నోసార్లు కలవాలనుకున్నామని, పలు వాయిదాల అనంతరం నాలుగు వారాల క్రితం కలుసుకున్నామని పవన్ గుర్తు చేసుకున్నారు.

pawan kalyan-ktr

ఆ సమయంలో తాము తమ రాజకీయ ఆలోచనలను పంచుకున్నామని, అలాగే, తామిద్దరి అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు. హ్యాండ్లూమ్, వీవర్స్ అంశాలపై మాట్లాడుకున్నట్లు చెప్పారు. కాగా, కాటమరాయుడు సినిమాలో పవన్ చేనేత దుస్తుల్లో కనిపించారు. దీనిపై కేటీఆర్ ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ సినిమా ద్వారా చేనేత దుస్తులకు మంచి ప్రచార కర్త దొరికాడని అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan thanks to Telangana Minister KT Rama Rao for his appreciation Katamarayudu film.
Please Wait while comments are loading...