హమ్మయ్యా... 10 ఏళ్లకు మనల్ని గుర్తుపట్టారు, ఇది తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి, పండగే !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల క్రితం విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆశలు గల్లంతు అయ్యాయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (యూపీఏ) అధికారంలో ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆ క్రెడిట్ మొత్తం అప్పటి టీఆర్ఎస్ పార్టీ (ప్రస్తుతం బీఆర్ఎస్), కేసీఆర్ ఖాతాలో పడిపోయింది. దెబ్బకు అప్పట్లో కేసీఆర్ సీఎం అయిపోయారు.
తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ బొక్కబార్లపడింది. ఐదు సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షలో కుర్చుంది. అయితే ఐదు ఏళ్ల తరువాత అయినా మనకు మంచిరోజులు వస్తాయని ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ మరోసారి జలక్ ఇచ్చారు. రెండోసారి కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించారు.

కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు, నువ్వానేనా అంటూ సొంత పార్టీ నాయకుల ముసుగులో దెబ్బలాటలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినింది. అయితే ఇప్పుడు పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఏ ముహూర్తానా రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో తెలీదు కాని యువతలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంటున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పడం. ఆదివారం మొదలైన కౌంటింగ్ లో అధిక నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దొరల తెలంగాణ పోవాలని, తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన వాళ్లకు న్యాయం జరగాలి అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లారు.

ఫలితంగా కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. మొత్తం మీద ఆదివారం తెలంగాణలో మొదలైన ఎన్నికల కౌంటింగ్ లో అనేక నియోజక వర్గాల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను గట్టిపోటీ ఇచ్చి దూసుకుపోతున్నారు. తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముందే డిసైడ్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ అప్పడే పండుగ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications