వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చానళ్ల బ్యాన్‌పై టీఎన్ఎస్ఎఫ్ 'విద్యార్థుల' ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికలకు ముందు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ వాడుకోనంతగా తెలంగాణ విద్యార్థులను తెరాస ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నడి రోడ్డు పైన వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి బుధవారం విమర్శించారు. ఫాస్ట్ పైన హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫాస్ట్ స్కీమ్ కుట్ర - పేద విద్యార్థుల భవిత - మీడియాపై నిషేదం అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లనే 191 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, సీఎం సొంత జిల్లాలోనే 33 మంది రైతులు కరెంటు కోతలు, పంట నష్టాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థులు వందరోజుల్లోనే ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందన్నారు. పోలీసులను పెట్టి కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు విద్యార్థులని అణిచివేస్తున్నారన్నారు.

టీటీడీపీ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ.. మీడియాను మెడలు విరిచేస్తానన్న కేసీఆర్ వెంటనే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయాడాన్ని ఆపకుంటే టీడీపీనే కేసీఆర్ ప్రభుత్వం మెడలు విరిచేస్తుందని హెచ్చరించారు. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరిచి, కల్మషం లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ స్కీంను అమలు చేయాలన్నారు. లేదంటే సభలో నిలదీస్తామని రమణ అన్నారు. అనాలోచిత నిబంధనలు విధించి వంచించే ప్రయత్నం చేస్తే పేద విద్యార్థుల చేతుల్లో తెరాస పతనం ఖాయమన్నారు.

టీఎన్ఎస్ఎఫ్

టీఎన్ఎస్ఎఫ్

ఎమ్మెల్యే వివేక్ గొడ్ మాట్లాడుతూ.. 35 సంవత్సరాల చరిత్ర గల టీడీపీ కేసీఆర్ లాంటి నియంతలను ఎంతోమందిని ఎదుర్కొందని, విద్యార్థులకు ద్రోహం చేస్తే కేసీఆర్‌కు కూడా అదే గతి పడుతుందన్నారు. కేసిఆర్ వంద రోజుల పాలనలోనే అన్ని వర్గాలను మోసం చేశారన్నారు.

టీఎన్ఎస్ఎఫ్

టీఎన్ఎస్ఎఫ్

ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుతో అయినా కేసీఆర్ తన వైఖరి మార్చుకొని ఫాస్ట్ స్కీంను రద్దు చేసి, ఫీజుల రీయింబర్సుమెంట్ స్కీంను యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించాలని లేదంటే అసెంబ్లీని 10వేలమంది విద్యార్థులతో ముట్టడిస్తామని హెచ్చరించారు.

 టీఎన్ఎస్ఎఫ్

టీఎన్ఎస్ఎఫ్

ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు వేలకోట్ల రాయితీలు ఇస్తున్న కేసీఆర్ పేద విద్యార్థులకు మాత్రం 1956 నిబంధనతో చదువుకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని, ఇది తాము సహించమన్నారు. ఫాస్ట్ స్కీంతో బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ వేసిన ఎత్తుగడను హైకోర్టు ధర్మాసనం తన తీర్పుతో తిప్పికొట్టిందన్నారు.

 టీఎన్ఎస్ఎఫ్

టీఎన్ఎస్ఎఫ్

విద్యార్థులను అణచడానికే వారికి అండగా నిలబడకుండా మీడియాపై నిషేధం విధించారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఫీజు రీయింబర్సుమెంట్స్ స్కీంను యథాతథంగా అమలు చేయాలని, మీడియాపై తెలంగాణలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, రీయింబర్సుమెంట్స్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు.

English summary
Photos of TNSF leader Anjaneyulu Goud Press release
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X