• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాద్ పూర్ణిమ ముంబైలో ప్రత్యక్షం: సినిమాల కోసమేనా? ఏం జరిగింది?

|

హైదరాబాద్‌: సుమారు నెలన్నర రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. తాను అనాథనని చెప్పుకొన్న ఆమె ముంబైలోని దాదర్‌ సమీపంలోని ఓ ఆశ్రమంలో మారుపేరుతో ఉంటున్నట్లు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులకు సమాచారం అందింది. సినిమాలపై ఆసక్తితోనే ఆమె ముంబై చేరినట్లు తెలిసింది.

25 రోజుల క్రితం ముంబై చేరుకున్న పూర్ణిమ.. సినిమాల్లో అవకాశాల కోసం ముంబైలోని ఫిల్మ్ స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. తాను ఊహించిన దాని కన్నా భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్న తరువాతనే పోలీసులను ఆశ్రయించానని.. అయితే, ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతోనే పోలీసులకు అబద్ధాలు చెప్పానని వెల్లడించింది. సినిమా స్టూడియోల ముందు తనను ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది. ఇక మనసులోని కోరికను తీర్చుకునే దిశగా అడుగులు వేసిన పూర్ణిమ తన జీవితాన్ని రిస్క్ ‌లో పెట్టుకోవడం గమనార్హం.

నెలన్నర క్రితం అదృశ్యం

నెలన్నర క్రితం అదృశ్యం

హైదరాబాద్‌ నగరంలోని నిజాంపేటలోని అమృతసాయి రెసిడెన్సీలో నివసించే నాగరాజు, విజయకుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూర్ణిమ సాయి(15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. జూన్ 7న పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

పూర్ణిమను కిడ్నాప్ చేసింది ఉపాధ్యాయులేనా?: రంగంలోకి 18బృందాలుపూర్ణిమను కిడ్నాప్ చేసింది ఉపాధ్యాయులేనా?: రంగంలోకి 18బృందాలు

కిడ్నాప్ కేసుగా దర్యాప్తు ముమ్మరం

కిడ్నాప్ కేసుగా దర్యాప్తు ముమ్మరం

తొలుత అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 15 బృందాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు షిర్డీ, పుణె తదితర నగరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో జులై 13న కిడ్నాప్ కేసుగా మార్చారు. అనంతరం మరింత ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

సినిమాలపై ఆసక్తితోనే..

సినిమాలపై ఆసక్తితోనే..

సినిమాల్లో నటించాలన్న ఆసక్తితోనే పూర్ణిమ సాయి ముంబై వెళ్లి దాదర్‌లోని ఓ సినీ స్డూడియో వద్ద సంచరిస్తుండగా స్థానికులు పోలీసుల సాయంతో డొంగరి బాల్‌సుధార్‌ ఆశ్రమంలో చేర్పించారు. వారికి తాను అనాథనని.. తన పేరు అనికాశ్రీగా చెప్పుకొంది. అంతేగాక, హైదరాబాద్‌ తుకారాంగేట్‌లోని సాయిశ్రీ అనాథాశ్రమం నుంచి వచ్చినట్లు పేర్కొంది. కాగా, అంతకుముందు పూర్ణిమ 15రోజులపాటు షిర్డీలో ఉన్నట్లు తెలిసింది.

ఆచూకీ దొరికిందిలా..

ఆచూకీ దొరికిందిలా..

ఈ మేరకు దాదర్‌లోని బోయవాడ పోలీసులు బాలిక చిత్రాలను ముంబైలో గోడలకు అంటించారు. కాగా, ఈ సమాచారం ఆదివారం తుకారాంగేట్‌ సీఐ రమేష్‌కు అందింది. దాదాపు 40 రోజులకుపైగా కుమార్తె ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పుట్టిన రోజే క్షేమ సమాచారం..

పుట్టిన రోజే క్షేమ సమాచారం..

అయితే, ఆదివారం పూర్ణిమ పుట్టిన రోజు కావడం, ఆ సాయంత్రానికి ఆమె క్షేమ సమాచారం అందడంతో వారు ఆనందపరశులయ్యారు. కాగా, సోమవారం పోలీసులు, తల్లిదండ్రులు ముంబైకి వెళ్లనున్నట్లు సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో ఇంతకుముందు పుర్ణిమను ఆమె చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులే కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వచ్చినప్పటికీ అదంతా అవాస్తవమని తేలిపోయింది.

English summary
The Cyberabad police on Sunday traced the 14-year-old girl, Poornima Sai, who was missing for last 40 days, in Balasudhar Gruh in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X