కృష్ణా నదీ జలాల్లో తెలంగాణా వాటా తేల్చేవరకు ఆ పని చెయ్యండి : కేంద్రాన్ని కోరిన రజత్ కుమార్
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కృష్ణా జలాల వాటాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వాటా తేల్చే వరకు 811 టీఎంసీలలో సగం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి పై కేంద్ర జల శక్తి శాఖ విడుదల చేసిన నేపథ్యంలో ఈరోజు ఇంజనీర్లు. న్యాయవాదులతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవికుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర జల శక్తి శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ అధ్యయనంపై చర్చించారు. పూర్తిగా అన్ని అంశాలు అధ్యయనం చెయ్యాలని వెల్లడించారు. పాలన, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించిన రజత్ కుమార్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర నీటి వాటాలు తేల్చే వరకూ ప్రస్తుతం 811 టీఎంసీల సగం ఇవ్వాలని కోరారు.

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల డీటైల్స్ ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, డిపిఆర్ లు కేంద్రానికి ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. దేవాదుల, పాలమూరు డిండి తదితర ప్రాజెక్టులన్నీ పాతవేనని గుర్తు చేసిన రజత్ కుమార్ కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల వివాదాల నేపథ్యంలో కృష్ణ, గోదావరి నది బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో పాటుగా, రెండు తెలుగు రాష్ట్రాల లోని నీటి పంపకాలు కేంద్ర అధీనంలో ఉంటాయని స్పష్టం చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications