హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్‌కు షాక్! కేసీఆర్ మోసం: కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత రమేష్ రాథోడ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, సీనియర్ నేత జానారెడ్డి సమక్షంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కీలక నేతగా ఎదిగిన రమేష్

కీలక నేతగా ఎదిగిన రమేష్


టీడీపీలో ఎంపీగా పనిచేసిన రమేష్ రాథోడ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం టీడీపీకి గుడ్ బై చెప్పి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బ్రోకర్లు, జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యతా? శనిలా కుంతియా: రేవంత్‌పై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలుబ్రోకర్లు, జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యతా? శనిలా కుంతియా: రేవంత్‌పై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్‌కు గుడ్ బై

టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్‌కు గుడ్ బై

అయితే, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి రమేష్ రాథోడ్ ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 105మంది జాబితాలో ఖానాపూర్ టికెట్ ఆయనకు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 కేసీఆర్ మోసం చేశారు..

కేసీఆర్ మోసం చేశారు..

ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై రమేష్ రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. తమను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తనకు టికెట్ ఇస్తానని చెప్పి.. నాన్ లోకల్ వాళ్లకు సీట్ ఇచ్చారని మండిపడ్డారు. ఓట్లు మావి.. సీట్లు వాళ్లకెందుకు? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా..

టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా..


47 నియోజకవర్గాల్లో తమ జాతి ప్రభావిత శక్తిగా ఉందని, తమ జాతి బాగుపడిందంటే కాంగ్రెస్ పార్టీతోనేనని రమేష్ రాథోడ్ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేస్తామన్నారు. కాగా, రమేష్ రాథోడ్ తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

English summary
TRS leader Ramesh Rathod on Friday joined Congress Party in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X