హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్‌కేసు: భోజనం చేయని రవితేజ, కెల్విన్, జీషాన్ సంబంధాలపై ప్రశ్నలు

టాలీవుడ్ సినీ నటుడు రవితేజ మధ్యాహ్న భోజనం చేయలేదు. అయితే ఆయన కోసం సిట్ అధికారులు డ్రై ప్రూట్స్ ‌ను తెప్పించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు రవితేజ మధ్యాహ్న భోజనం చేయలేదు. అయితే ఆయన కోసం సిట్ అధికారులు డ్రై ప్రూట్స్ ‌ను తెప్పించారు. ఈ ఫ్రూట్స్‌తోనే ఆయన సరిపెట్టుకొన్నారు. అయితే భోజనం ఆఫర్ చేసినా కానీ ఆయన డ్రైఫ్రూట్స్ మాత్రమే తీసుకొంటానని చెప్పారని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

శుక్రవారంనాడు ఉదయం పది గంటలకు రవితేజ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొన్నారు. ఆయన విచారణ కొనసాగుతోంది. 7 గంటలు దాటినా ఆయన విచారణ సాగుతోంది. అయితే పూరీ జగన్నాథ్ తర్వాత సినీ రంగానికి చెందిన ప్రముఖుల్లో రవితేజ కీలకమైన వ్యక్తి.

పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ: న్యాయవాదుల సలహలు, ఆ కారే ఎందుకంటే?పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ: న్యాయవాదుల సలహలు, ఆ కారే ఎందుకంటే?

అయితే రవితేజ విచారణతో మొదటి దశ చివరిదశకు చేరుకొంది. అయితే ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. అయితే తమ వద్ద ఉన్న సమాచారాన్ని రూఢీ చేసుకొనేందుకు విచారిస్తున్నారు.

Ravi Teja interrogation continues for 7 hours

ఈ విచారణలో కూడ కీలకమైన సమాచారాలను కూడ సేకరిస్తున్నారు. అయితే ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకుగాను సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.సిట్ విచారణ సందర్భంగా మధ్యాహ్న భోజనం చేయలేదు రవితేజ. భోజన విరామ సమయంలో ఆయనకు సిట్ అధికారులు భోజనం ఆఫర్ చేసినా కానీ, ఆయన భోజనం తీసుకోలేదు. అయితే డ్రైప్రూట్స్ మాత్రమే తీసుకొన్నారు.

అయితే ఆయన కోసం డ్రైఫ్రూట్స్‌ను తెప్పించారు. సిట్ అధికారులు వేస్తున్న ప్రశ్నకు రవితేజ ఆచితూచిసమాధానాలు చెబుతున్నట్టుగా సమాచారం. కెల్విన్, జీశాన్‌లతో సంబంధాలపై ప్రధానంగా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే ఈ ప్రశ్నలకు ఆయన ఆచితూచి సమాధానాలు చెబుతున్నారు.ఈ విషయమై ఆయన ఇప్పటికే న్యాయవాదుల సలహలను తీసుకొన్నారు.

English summary
Ravi Teja took dry fruits for lunch. Popular Telugu film actor Ravi Teja today appeared before the Telangana Prohibition and Excise Department’s special investigation team (SIT) in connection with a high-end online drug racket busted by it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X