మంత్రి కొండా సురేఖతో రేణూ దేశాయ్ భేటీ!!

ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ నేడు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిశారు. జూబ్లీహిల్స్ లోని కొండ సురేఖ నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రేణు దేశాయ్ కొండ సురేఖతో అనేక అంశాల పైన మాట్లాడారు.

కొండా సురేఖను కలిసిన రేణూ దేశాయ్
కొండ సురేఖతో భేటీ సందర్భంగా రేణు దేశాయ్ వన్యప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన అనేక విషయాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీ కి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించారు. మంత్రిగా కొండా సురేఖ సహాయ సహకారాలు కావాలని రేణు దేశాయ్ కొండా సురేఖతో అన్నారు.

Renu Desai met Minister Konda Surekha

రేణూ దేశాయ్ కి ప్రత్యేకంగా గొలుసు స్వహస్తాలతో అలంకరించిన కొండా సురేఖ
సహజంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఎవరినైనా అత్యంత ఆప్యాయంగా పలకరించే కొండ సురేఖ తన ఇంటికి వచ్చిన రేణు దేశాయ్ ని చాలా స్పెషల్ గా ట్రీట్ చేశారు. నూతన వస్త్రాలు, పండ్లు ఇచ్చి సత్కరించారు. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ కోసం ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయ్ కు తన స్వహస్తాలతో అలంకరించి ఆదరాభిమానాలను చూపించారు.

రేణూ దేశాయ్ కొండా సురేఖ భేటీపై పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి
మొత్తానికి రేణు దేశాయ్ కొండా సురేఖను కలవడం,మాట్లాడటం పైన అందరిలో ఆసక్తి వ్యక్తం అవుతుంది. ఇక తాజాగా రేణు దేశాయ్ కొండ సురేఖనును కలిసిన విషయంపైనా పవన్ ఫ్యాన్స్ దృష్టి సారించారు. పవన్ కు దూరంగా రేణు దేశాయ్ తన పని తాను చేసుకుపోతున్నా ఆమె పైన మాత్రం పవన్ అభిమానుల నిఘా కొనసాగుతూనే ఉంటుంది.

పవన్ లానే రేణూ దేశాయ్ లో ఆ క్వాలిటీస్.. సురేఖతో భేటీతో స్పష్టం
తాజాగా మంత్రి కొండా సురేఖ ను కలిసి మాట్లాడిన అంశాలతో పవన్ కళ్యాణ్ లో ఉన్న కొన్ని లక్షణాలు రేణు దేశాయ్ లో కూడా ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు. మనసులోనే ఆమెను మెచ్చుకుంటున్నారు. రేణు దేశాయ్ కూడా పవన్ లాగానే పర్యావరణాన్ని కాపాడాలని ఆలోచన ఉన్న వ్యక్తి. అంతేకాదు పవన్ లానే ధార్మిక చింతన ఉన్న వ్యక్తి.. ఈ విషయం నేడు కొండా సురేఖ తో మాట్లాడిన అంశాలతో వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+