వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవాస్తవాలే, పనితీరు సరిగా లేని టెక్కీలపై వేటు: మోహన్‌దాస్‌పాయ్

ఐటీరంగంలో నెలకొన్న పరిణామాలపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారనే వార్తలు నిరాధరమని చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపిస్తున్నారని ఇన్పోసిస్ మాజీ ఫైనాన్షియల్ అధికారి మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐటీరంగంలో నెలకొన్న పరిణామాలపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారనే వార్తలు నిరాధరమని చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపిస్తున్నారని ఇన్పోసిస్ మాజీ ఫైనాన్షియల్ అధికారి మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు.

ఐటీ పరిశ్రమలో భారీగా లేఆఫ్‌లు ఉంటాయనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగ భద్రతపై పలు కథనాలు రావడంతో వారిలో ఆందోళన ఏర్పడిందన్నారు. కానీ, భారీస్థాయిలో కోతలు ఉండవని స్పష్టం చేసింది.

Reports of depression among IT professionals exaggerated: Mohandas Pai

ఐటీ రంగం పురోగతి ఆశాజనకంగా ఉందన్నారు. రానున్నకాలంలో ఆరులక్షల ఐటీ ఉద్యోగాలు రద్దు కానున్నాయన్న వార్తలను నమ్మవద్దన్నారు. సరైన పనితీరు లేని ఉద్యోగులను తొలగిస్తారని ఆయన చెప్పారు.

ఆయా సంస్థల్లో ఎక్కువగా ఉన్న ఉద్యోగులను మాత్రమే తొలగిస్తారని ఆయన చెప్పారు. ఐటీ పరిశ్రమలో ఉద్దేశ్యపూర్వకంగానో, లేదా ఇతరత్రా కారణాలతో ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారాయన.

English summary
The reports of job insecurity leading to high levels of anxiety and depression among information technology professionals in India are baseless and exaggerated as there are no large scale layoffs, says a senior figure in the IT industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X