డ్వాక్రా గ్రూప్ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. నెలకు లక్ష సంపాదించే ఛాన్స్!
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం, మహిళల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటుంది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలకు ఆర్థిక భరోసా అందించే అనేక అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పాడి రంగంలో మహిళలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.
డ్వాక్రా మహిళలకు మరో అద్భుత అవకాశం
ఇందిర మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు విజయ డెయిరీ పార్లర్ లను కేటాయించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒకటి రెండు వారాలలో డి ఆర్ డి ఓ, మెప్మా సంస్థలకు ఈ పార్లర్ ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు.

డెయిరీ పార్లర్ ల కేటాయింపు ఇలా
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఎండి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పార్లర్ల ఏర్పాటుపై చర్చించి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి మండలంలోనూ ఒక పార్లర్ ను, పురపాలక సంఘాలకు రెండు పార్లర్లకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్న స్వయంసహాయక సంఘాలు పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యకు వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
డెయిరీ పార్లర్ మంజూరు ప్రక్రియ ఇలా
. దరఖాస్తు చేసుకున్న మహిళా సంఘాల సభ్యులు పార్లర్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని స్వయంగా పరిశీలించి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్థల పరిశీలన పూర్తయిన తర్వాత MD TGDDCF లాలాపేట పేరుతో ఐదు వేల రూపాయల డిడి తీసి అందజేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలు కూడా అందిన తర్వాత పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య సంబంధిత మహిళా సంఘానికి డెయిరీ పార్లర్ ను మంజూరు చేస్తుంది.
డెయిరీ ఏర్పాటుకు సంఘానికి ఋణం
ఒక్కొక్క పార్లర్ ఏర్పాటు చేయడానికి సుమారు 5 లక్షల రూపాయల వరకు అవుతుంది. అయితే ఇందులో సంఘం తమ వాటాగా లక్ష రూపాయలు సమకూర్చుకుంటే, మిగిలిన మొత్తం సంఘం పనితీరును బట్టి రుణంగా అందుతుంది. ఈ పార్లర్ లను ఏర్పాటు చేసుకుంటే విజయ డైరీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. దీనిద్వారా మహిళా సంఘాలు ప్రతినెల లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది.
-
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications