వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుపల్లికి రేవంత్ షాక్:' నన్ను ప్రశ్నించే అధికారం లేదు', 'అతనో చీడపురుగు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారనే విషయమై తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశంలో రేవంత్‌రెడ్డి నోరు మెదపలేదు. అంతేకాదు తనను ప్రశ్నించేందుకు మీరేవరంటూ టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహ్ములును ప్రశ్నించారని సమాచారం.

టి.టిడిపిలో రేవంత్ 'చిచ్చు': అక్టోబర్ 26న, టిడిఎల్పీ సమావేశం, ఏం జరుగుతోంది?టి.టిడిపిలో రేవంత్ 'చిచ్చు': అక్టోబర్ 26న, టిడిఎల్పీ సమావేశం, ఏం జరుగుతోంది?

ఈ విషయమై తాను టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు వివరణ ఇవ్వనున్నట్టు రేవంత్‌రెడ్డి చెప్పారని తెలుస్తోంది.

రేవంత్ వెంట నడిచెదేవరు: లెక్కలు వేస్తున్న టిడిపి, అదే జరిగితే భారీ మూల్యం?రేవంత్ వెంట నడిచెదేవరు: లెక్కలు వేస్తున్న టిడిపి, అదే జరిగితే భారీ మూల్యం?

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహరం నాలుగు రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని సమాచారం.

కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్

2019 ఎన్నికల్లో పొత్తుల విషయంలో తెలంగాణ టిడిపి నేతల మధ్య సఖ్యత లేకుండాపోయింది. కాంగ్రెస్‌తో పొత్తును మోత్కుపల్లి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారని ప్రచారం. అయితే ఈ విషయమై రేవంత్‌రెడ్డి మాత్రం ఈ విషయమై నోరు తెరవలేదు.

మోత్కుపల్లికి షాకిచ్చిన రేవంత్ రెడ్డి

మోత్కుపల్లికి షాకిచ్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశంలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి, పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహ్ములు మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారా లేదా స్పష్టత ఇవ్వాలని రేవంత్‌ను మోత్కుపల్లి నిలదీశారని సమాచారం. అయతే ఈ విషయంలో ఇద్దరికీ మద్య వాగ్వాదం చోటుచేసుకొంది. మోత్కుపల్లి నర్సింహ్ములుకు అరవింద్‌కుమార్‌గౌడ్‌లు మద్దతిచ్చారు.అయితే ఈ విషయమై తనను ప్రశ్నించే అధికారం మోత్కుపల్లి నర్సింహ్ములుకు లేదని రేవంత్‌రెడ్డి షాకిచ్చారని సమాచారం.

ఆ అధికారం చంద్రబాబుకు మాత్రమే

ఆ అధికారం చంద్రబాబుకు మాత్రమే


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిసిన విషయమై పార్టీ నేతలకు రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వలేదని సమాచారం. అయితే తాను తనపై వచ్చిన ఆరోపణలపై నేరుగా చంద్రబాబునాయుడుకే సమాధానం ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారని సమాచారం.కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించినట్టు వచ్చిన వార్తలపై రేవంత్‌పై పార్టీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం.

పార్టీ కోసం ఎవరు పనిచేశారో తెలుసు

పార్టీ కోసం ఎవరు పనిచేశారో తెలుసు

ఇన్నాళ్లు పార్టీ కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసంటూ తనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నేతలపై రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. పార్టీ కోసం నేను జైలుకు వెళ్లానని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. త్వరలో అందరి సంగతి తెలుస్తా.. ఇంకా చాలా విషయాలు బయటపెడతా అని ఆయన హెచ్చరించారు. ఏ విషయం దాచిపెట్టాల్సిన అవసరం తనకు లేదని, సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారని చెప్పారని సమాచారం.

 రేవంత్‌తో పార్టీకి తీవ్ర నష్టమే

రేవంత్‌తో పార్టీకి తీవ్ర నష్టమే

‘రేవంత్ వల్ల పార్టీకి చీడ పట్టింది. ఆ చీడ ఎంత దూరం వచ్చిందటే మొత్తం చెట్టే కూలిపోయే పరిస్థితి వచ్చింది. రేవంత్ వల్ల చంద్రబాబుకు మచ్చ వచ్చింది. రేవంత్‌కు విశ్వనీయత లేదు'' అని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌పై మోత్కుపల్లి నర్సింహ్ములు ఒంటికాలిపై విమర్శలు గుప్పించారు.

English summary
Even as party secretary general Nara Lokesh arrived in Hyderabad to douse the fires within the Telugu Desam Party following Revanth Reddy's explosive comments, the party meeting of the top brass in Telangana ended with senior leaders Motkupalli Narsimhulu and Aravind Goud staging a walkout.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X