నల్గొండకు ఉప ఎన్నిక వస్తే.. రేవంత్ రెడ్డి పోటీ, నేతల ఒత్తిడి? ఇదీ ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Revanth Reddy may contest in Nalgonda bypoll నల్గొండ ఉప ఎన్నిక, రేవంత్ రెడ్డి పోటీ

  హైదరాబాద్: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే, నల్గొండ ఉప ఎన్నిక అనివార్యమైతే టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా బరిలో నిలబడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

  గుత్తా 'షాక్'కు ముందే కెసిఆర్ వ్యూహం, కోమటిరెడ్డి బ్రదర్స్ నిలుస్తారా?

  రేవంత్ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చునని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఆయనే దీటైన అభ్యర్థి అని నల్గొండ జిల్లా టిడిపి పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బిజెపితో కలిసి టిడిపి తరఫున చిన్నపరెడ్డి పోటీ చేశారు. ఆయనకు రెండో స్థానం దక్కింది.

  రేవంత్ రెడ్డి బరిలో నిలిచే ఛాన్స్

  రేవంత్ రెడ్డి బరిలో నిలిచే ఛాన్స్

  టిఆర్ఎస్ తరఫున సరైన అభ్యర్థిని సీఎం కేసీఆర్‌ బరిలోకి దింపే అవకాశమున్నందున రేవంత్‌ రెడ్డి దీటైన అభ్యర్థిగా నిలిచే అవకాశముందని టిడిపి భావిస్తోందని అంటున్నారు.

  వారు మద్దతిస్తారని టిడిపి అంచనా

  వారు మద్దతిస్తారని టిడిపి అంచనా

  నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు, సామాజికవర్గాలు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తాయన్న అంచనాలో టిడిపి నేతలు ఉన్నారని తెలుస్తోంది.

  రేవంత్ బరిలో నిలిస్తే ఇతర పార్టీలకు ఛాన్స్

  రేవంత్ బరిలో నిలిస్తే ఇతర పార్టీలకు ఛాన్స్

  నల్గొండకు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ సాగుతోంది. కోమటిరెడ్డి సోదరుల అంశం సస్పెన్స్‌గా ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ బరిలోకి దిగితే ఇతర పార్టీలు కూడా మద్దతిస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఉందని చెబుతున్నారు.

  రేవంత్ రెడ్డిపై నేతల ఒత్తిడి

  రేవంత్ రెడ్డిపై నేతల ఒత్తిడి

  టిఆర్ఎస్ వ్యతిరేక కూటమి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని టిడిపి నల్గొండ జిల్లా నేతలు భావిస్తున్నారు. ఈ దిశగా రేవంత్ రెడ్డిపై పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక తుది నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Telugu Desam working president Revanth Reddy may contest in Nalgonda bypoll if elections will held. TDP leaders are pressuring him to contest.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X