నల్గొండపై ప్రచారం.. ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే టిడిపి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన శుక్రవారం స్పందించారు.

నల్గొండకు ఉప ఎన్నిక వస్తే.. రేవంత్ రెడ్డి పోటీ, నేతల ఒత్తిడి? ఇదీ ప్లాన్

పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నలభై నెలల పాలనలో చేపట్టిన పథకాలు ప్రజలను మభ్యపెట్టేవే తప్ప, ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని ఆయన ఆరోపించారు.

Revanth Reddy says he is ready to contest from anywhere

ప్రచార ఆర్భాటాలే తప్ప చేసిందేమీ లేదని, జీవో 39పై కోర్డులో కేసులు వేసింది టీఆర్ఎస్ నేతలేనని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం పార్టీని కాపాడుకునే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.

టిఆర్ఎస్ కార్యకర్తలకు సొమ్మును దోచిపెట్టడానికే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. లోపభూయిష్టంగా ఏర్పాటు చేసిన ఈ సమితులను టిడిపి వ్యతిరేకిస్తోందన్నారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugu Desam party leader Revanth Reddy on friday said that he is ready to contest from any where in telangana if party high command will order.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X