తెలంగాణా తల్లి, త్యాగశీలి సోనియమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి, సీతక్క ట్వీట్స్
డిసెంబర్ 9.. ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సాకారమైన రోజు, కెసిఆర్ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, డిసెంబర్ 9 తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినం అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణా కాంగ్రెస్ రక్తదాన శిబిరం
ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది సికింద్రాబాద్ బోయినపల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్అలీ, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానం చేశారు అంతేకాదు ఇటీవల మరణించిన కాంగ్రెస్ సభ్యుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల రాజీవ్ గాంధీ బీమా పథకం చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణా రాష్ట్రకలను సాకారం చేసిన సోనియమ్మ: రేవంత్ ట్వీట్
ఈ సందర్భంగా ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియమ్మ జన్మదినం సందర్భంగా ఈరోజు బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన మహా నాయకురాలు సోనియా గాంధీ అంటూ అభివర్ణించారు. గరీబోడి దైవం ఇందిరమ్మకు వారసురాలు, రాజీవ్ ఆలోచనలకు కార్యరూపమిచ్చిన ధీశాలి సోనియా గాంధీ అన్నారు. మన సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.
దేశం కోసం త్యాగం చేసిన సోనియమ్మ.. ఎమ్మెల్యే సీతక్క ట్వీట్..
ఇదే సమయంలో ఎమ్మెల్యే సీతక్క కూడా సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోనియా గాంధీ దేశం కోసం చేసిన త్యాగాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన భర్త చనిపోయిన తర్వాత కూడా భారతదేశానికి భారతీయులకు అండగా నిలిచిన సోనియాగాంధీకి, దేశ భవిష్యత్తు కోసం పనిచేసే కఠినమైన నాయకులుగా రాహుల్ గాంధీ ని, ప్రియాంక గాంధీ ని పెంచిన సోనియా గాంధీకి, తనకు తనతో పాటు అందరికీ ఇష్టమైన సోనియమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎమ్మెల్యే సీతక్క ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రదాత, త్యాగశీలి సోనియా గాంధీ: తెలంగాణా కాంగ్రెస్
ఇక యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర కల సోనియా గాంధీ జన్మదినం రోజున సహకారం చేశారని సోనియా గాంధీని కొనియాడారు. తెలంగాణ ప్రదాత , త్యాగశీలి సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది. మొత్తానికి సోనియా గాంధీ జన్మదినం నాడు తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాకారానికి మూల కారణమైన సోనియాగాంధీని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, నాడు ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం వల్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications