అల్లు అర్జున్ అరెస్ట్, రేవంత్ రెడ్డి అరెస్ట్ లలో కామన్ పాయింట్ ఇదేనన్న ఆర్జీవీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళిన సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో ఒక మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం, కోర్టుకు పంపడం, కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్ట్ పై రాం గోపాల్ వర్మ పోస్ట్
ఆపై తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పైన చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు.ఈ పోస్టులో గతంలో రేవంత్ రెడ్డిని పోలీసుల అరెస్టు చేసిన వ్యవహారాన్ని గుర్తు చేశారు.

అల్లు అర్జున్ కు గొప్ప బహుమతి ఇది
రాంగోపాల్ వర్మ నిన్న చేసిన పోస్ట్ లో తెలంగాణ రాష్ట్ర నివాసి, భారతదేశపు బిగ్గెస్ట్ స్టార్ భారతీయ సినిమా మొత్తం చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందిస్తే తెలంగాణ రాష్ట్రం అతనిని జైలుకు పంపి గొప్ప బహుమతిని అందించింది అని అల్లు అర్జున్ ను జైలుకు పంపించడం పైన రాంగోపాల్ వర్మ సంచలన పోస్ట్ పెట్టారు.
పుష్ప 2 కు పబ్లిసిటీ బూస్ట్
ఆ తర్వాత మరొక పోస్టులో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఇలా ఎందుకు చేశారో అందరికీ ఆశ్చర్యం కలిగించిందని అయితే పుష్ప 2 సినిమా రెండవ వారం వసూళ్లలో భారీ పెరుగుదల కోసం భారీ పబ్లిసిటీ బూస్ట్ ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఇలా చేశారని అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే బెయిల్ పొంది మరింత పాపులర్ అయి బాక్సాఫీస్ ని లాంగ్ టైం కోసం పాలించేలా ఉద్దేశపూర్వకంగానే బలహీనమైన ప్రాసిక్యూషన్ ని రాష్ట్రం చేసిందని ఆయన పేర్కొన్నారు.
What’s common between the HONOURABLE CHIEF MINISTER OF TELANGANA @revanth_anumula and INDIA’S BIGGEST STAR @alluarjun is , they both got ARRESTED FROM THEIR BEDROOMS 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/bg7YJH1Qdl
— Ram Gopal Varma (@RGVzoomin) December 15, 2024
అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి అరెస్ట్ లో కామన్ పాయింట్ ఇదే
పుష్ప 2కు సూపర్ కలెక్షన్స్ తీసుకొచ్చి సూపర్ హైగా నిలబెట్టినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ఇక తాజాగా మరో పోస్ట్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అరెస్ట్ లో కామన్ పాయింట్ ఏమిటి అని నెటిజన్ల అడిగిన ప్రశ్నకు ఆర్జీవి వాళ్ళిద్దరూ తమ బెడ్ రూమ్ లో ఉన్నప్పుడే అరెస్టు అయ్యారంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఇక సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులు పెడుతున్న ఆర్జీవి అల్లు అర్జున్ అరెస్టు పైన పెడుతున్న పోస్టులు కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications