ఘోర ప్రమాదం: ఆటో-లారీ ఢీ, ఐదుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

Subscribe to Oneindia Telugu

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఫ్లైవర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

బండమీదిపల్లికి వెళ్తున్న ప్రయాణికుల ఆటోను లారీ వేగంగా ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

 road accident in jadcherla: five killed

గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తరచూ ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకవోడం లేదంటూ స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

బాధితులు బండమీదిపల్లి పరిసర గ్రామాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five persons killed in a road accident occurred at jadcherla in Mahabubnagar district on Saturday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి