ఇది స్కాంగ్రెస్ A టు Z.. ఆ స్కాములపై జోరుగా బీఆర్ఎస్ ప్రచారం!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అవినీతి కుటుంబ పాలన పై కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన కుంభకోణాలను ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ వేస్తుంది. దేశంలోనే అతి ప్రాచీనమైన రాజకీయ పార్టీ వివిధ రకాల కుంభకోణాలు, అవినీతి కార్యకలాపాల ద్వారా లక్షల కోట్లు దోచుకున్నారని గులాబీ పార్టీ నేతలు కరపత్రాలను పంచుతున్నారు.
వివిధ స్కాముల ద్వారా కాంగ్రెస్ దోచుకున్న ప్రజాధనం రూ. 48,20,69,00,00,000 కోట్లని బీఆర్ఎస్ ప్రచారాన్ని చేపట్టింది. ఇది స్కాంగ్రెస్ ఏ టు జెడ్ అంటూ ప్రచారం చేస్తున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ హయాంలో ఏ ఏ సంవత్సరాలలో ఏ ఏ కుంభకోణాలు జరిగాయో ఆ డేటా తో పోస్టర్లు వేస్తుంది.

కాంగ్రెస్ పార్టీ హయాంలో 1948లో జీప్ స్కాండల్ కేసు, 1947 ఐఎన్ఏ ట్రెషర్ చెస్ట్ కుంభకోణం, 1956ఆరులో బీహెచ్ యు ఫండ్స్, 1974లో మారుతి స్కాండల్, 1989లో సెయింట్ కిట్స్ ఫోర్జరీ, 1987లో బోఫోర్స్, 1981లో సిమెంట్ స్కామ్, 1981లో హౌసింగ్ స్కాం ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో చోటుచేసుకున్న స్కాములపై ప్రచారం చేస్తుంది.
1996లో టెలికాం స్కామ్, 1992లో హర్షద్ మెహతా స్కామ్, 2013లో వాద్రా డీఎల్ఎఫ్ ల్యాండ్ గ్రాబ్, 2012లో నేషనల్ హెరాల్డ్ స్కాం, 2002లో తెల్గీ స్కాం, 2008లో 2జి స్పెక్ట్రమ్ స్కామ్, 2015లో నోట్ ఫర్ వోట్ స్కామ్, ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాల లిస్ట్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దోపిడీకి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది.
A to Z of Scamgress Party Scams👇
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) September 22, 2023
A - Adarsh Scam
B - Bofors Scam
C - CWG Scam
D - Devas-Antrix Scam
E - Employee Guarantee Scheme Scam
F - Fodder Scam
G - Ghaziabad Provident Fund Scam
H - Harshad Mehta Stock Market Scam
I - IPL Scam
J - Junior Basic Trained Teachers'… pic.twitter.com/hh2RMPds0R
ఇక ఇదే సమయంలో స్కాములు చేయాలి.. రాష్ట్రాన్ని మింగాలి.. అదే వాళ్ళ ధ్యేయం, వీళ్ళు మనకు కావాలా? ఆలోచించండి.. ఆగం కాకండి అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అందుకే తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ కు ఓటేస్తే దోపిడీ పాలన సాగుతుందని చెప్తుంది బీఆర్ఎస్.












Click it and Unblock the Notifications