చేపల కూర ఎంత పనిచేసింది?: రెండు రాష్ట్రాల వాళ్లు ఎంతలా కొట్టుకున్నారంటే!

Subscribe to Oneindia Telugu

భద్రాచలం: నోరూరించే చేపల కూరంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. అలా అని.. పక్కింటివాళ్లు చేసుకున్న కూరను లాగేసుకుంటామంటే కుదరదు కదా!. కాదు, కూడదు అని కూర కోసం బెదిరింపులకు దిగితే యుద్దాలు తప్పవు. అచ్చు ఇదే తరహాలో భద్రాచలం పరిధిలో తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిపై జరుగుతున్న రెండో వారధి పనుల నిమిత్తం పలువురు బీహార్, వెస్ట్ బెంగాల్ కార్మికులు అక్కడికి వలస వచ్చారు. రోజూ అక్కడి పనుల్లో పాల్గొంటూ.. సమీపంలోనే తాత్కాళిక నివాసాలను ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. బీహారీలు, బెంగాలీలు ఎవరి వంట వారే చేసుకుంటున్నారు.

scuffle between biharis and bengalis for fish curry

ఈ క్రమంలో ఆదివారం రాతరి బీహార్ కు చెందిన కార్మికులు చేపలు తెచ్చుకుని వండుకున్నారు. తీరా తినే సమయానికి వెస్ట్ బెంగాల్ కు చెందిన 12మంది కార్మికులు అక్కడికి వచ్చారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న బెంగాలీలు.. తమకూ చేప కూర కావాలంటూ పట్టుబట్టారు. కుదరదని బీహారీలు చెప్పారు. అంతే, మాటా మాటా పెరిగి కర్రలు, రాడ్లతో కొట్టుకునేదాకా వచ్చింది.

ఈ దాడిలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని స్థానిక ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై బీహారీ కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Bhadrachalam town, A scuffle took place between Bihari's and Bengali's for fish curry. All these are migrated for employement
Please Wait while comments are loading...