మరికొద్ది గంటల్లో కౌంటింగ్: తనపై కుట్ర జరిగిందని సీతక్క ఆవేదన!!

మరికొద్ది గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అందరు అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా మేము గెలుస్తాము అని ధీమా వ్యక్తం చెయ్యగల అభ్యర్థులు తెలంగాణాలో ఎవరూ కనిపించని పరిస్థితి. ఈసారి ఎన్నికల ఫలితాలు అభ్యర్థుల ఊహకు అందకుండా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చాలా చోట్ల గెలుస్తారు అనుకున్న అభ్యర్థులు ఓడిపోతారని చర్చ జరుగుతుంది.

ఊహించని విధంగా టఫ్ ఫైట్ కొనసాగిన నియోజకవర్గాలు కూడా లేకపోలేదు. ఇక అలాంటి నియోజకవర్గాలలో ములుగు నియోజకవర్గం ఒకటి. ములుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. హోరాహోరీగా పోరాటం చేశారు. కానీ అక్కడ సీతక్కకు బీఆర్ఎస్ నుండి బరిలోకి దిగిన నాగజ్యోతి బలమైన పోటీ ఇచ్చారు. ఒక దశలో సీతక్క అక్కడ ఓడిపోతున్నారని ప్రచారం కూడా జరిగింది.

Seethakka shocking comments: that there was a conspiracy against her!!

ఇక తాజాగా తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికలపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. బీఆర్ఎస్ నేతలు తనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, కుట్ర రాజకీయాలతో తనను ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టేందుకు శత విధాలా ప్రయత్నం చేశారన్నారు.

తన కార్యకర్తలను డబ్బులతో కొన్నారని, వారితో తనపై తప్పుడు ప్రచారం చేయించారని సీతక్క ఆరోపించారు . తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తాను ప్రజల వెంటే ఉంటానని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని సీతక్క అన్నారు. ములుగు ప్రజలు కూడా తన వెంటే ఉన్నారన్న నమ్మకం తనకు ఉందన్నారు.

ఆడబిడ్డగా తనను ములుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారని సీతక్క పేర్కొన్నారు. చిన్నపిల్లలు కూడా మా సీతక్క అని ఆప్యాయంగా ఆదరించారని, ఇంతకన్నా తన జీవితానికి ఇంకేం కావాలని సీతక్క ప్రశ్నించారు. తన గెలుపు కోసం ఎంతో కష్టపడి పని చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్న సీతక్క, పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+