తెలంగాణలో సెప్టెంబర్ 17 పొలిటికల్ వార్: రంగంలోకి కేసీఆర్!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. సెప్టెంబర్ 17వ తేదీన టార్గెట్ చేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెట్టి కెసిఆర్ ను టార్గెట్ చేయాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే, ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్.

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడానికి బిజెపి సిద్ధమైంది. సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లేదా రాజ్నాథ్ సింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

September 17 political war in Telangana: competitive public meetings!!

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నాడు, తెలంగాణ సెంటిమెంట్తో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని బిజెపి భావిస్తుంది. మరోవైపు తెలంగాణలో ఈనెల 16, 17 తేదీలలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకుంది. దీంతో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజు కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా బహిరంగ సభలకు రెడీ అయ్యాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది.

September 17 political war in Telangana: competitive public meetings!!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి, తెలంగాణలో తమ సత్తా చాటి, పట్టు నిలుపుకునే ప్రయత్నం రెండు పార్టీలు చేయనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రూట్ మార్చారు. బిజెపి, కాంగ్రెస్ సభలకు కౌంటర్ సభగా బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది .సెప్టెంబరు 17 లేదా 18వ తేదీన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను ప్రారంభించాలని నిర్ణయించారు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే సెప్టెంబర్ 17 పాలిటిక్స్ లో ఏ పార్టీ ప్రజల మద్దతును గెలుచుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+