అల్లు అర్జున్ కు ఊహించని షాక్.. సీరియస్ వార్నింగ్!
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన వ్యవహారంలో అల్లు అర్జున్ పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచి, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడా జైలుకు పంపించారు.
అల్లు అర్జున్ కేసు
అనంతరం మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ చేసిన పనిని అల్లు అర్జున్ కారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారని చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఆత్మ రక్షణలో పడి తన పైన తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ దాడి
ఇక ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఇంటి పైన ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు దాడి చేసి ఇంటి ముందు పూల కుండీలు పగలగొట్టారు. అల్లు అర్జున్ ఇంటిలోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. నివాసం పైకి రాళ్లు విసిరారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నాయకులకు బెదిరింపులు
ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక ఈ దాడిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన విద్యార్థి నాయకులకు అల్లు అర్జున్ అభిమానుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే అల్లు అర్జున్ కు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
చట్టరీత్యా చర్యలకు డిమాండ్
అల్లు ఆర్మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ ఓయూ జెఏసి విద్యార్థి నేతలకు వస్తున్నాయని, వారు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ఎటువంటి ప్రాణహాని కలిగిన దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలన్నారు.
అల్లు అర్జున్ కు ఓయూ జేఏసీ హెచ్చరిక
అంతేకాదు ఓయూ జేఏసీ నేతల ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని తమకు ఫోన్ కాల్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అల్లు అర్జున్ దే అని వారు తేల్చి చెప్పారు. ఓయూ జేఏసీ నేతలకు వస్తున్న బెదిరింపు కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చేసి బెదిరిస్తున్న వారి పైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications