ఇదేంట్రా.. ఒకే ఆధార్ నంబర్ ఇద్దరికిచ్చారు!
దేశంలో ప్రతి వ్యక్తికి ఇచ్చే ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు భారతదేశంలో అనేక ప్రయోజనాల కోసం అవసరం. 12 అంకెల ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసే కార్డు. వ్యక్తి యొక్క గుర్తింపు మరియు చిరునామా రుజువు గాను, అనేక ప్రభుత్వ సేవలకు, సబ్సిడీలకు గాను ఉపయోగిస్తారు.
ఆధార్ కార్డుల జారీ, ఉపయోగం ఇలా
బ్యాంకు ఖాతాలు తెరవడానికి మొబైల్ ఫోన్ నెంబర్లకు సిమ్ కార్డ్ లు కొనుగోలు చేయడానికి, ఇతర అధికారిక సేవలు కోసం ఆధార్ కార్డును ఉపయోగిస్తారు.ఆధార్ నంబర్ ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే ఆధార్ నంబర్‌ను ఇద్దరు వ్యక్తులకు జారీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది బయోమెట్రిక్ డేటాతో లింక్ చేయబడి ఉంటుంది. మనకు ఆధార్ నంబర్ కేటాయించేటప్పుడు వేలిముద్రలతో పాటు ఐరిస్ కూడా తీసుకుంటారు.

ఒకే నంబర్ ఇద్దరికీ ఇస్తే ఇబ్బందులు
పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాలను తీసుకుని వాటి ఆధారంగా ఆధార్ నెంబర్ను కేటాయిస్తారు. అయితే ఎవరికి వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉండే ఆధార్ ఒకే నెంబర్ మీద ఇద్దరికి జారీ చేస్తే ఆయా ఆధార్ కార్డులు తీసుకున్నవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అటువంటి సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది

ఇద్దరు బాలురికి ఒకే ఆధార్ నెంబర్ కేటాయింపు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్‌లోని రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలురకు ఒకే ఆధార్ నంబర్ వచ్చింది. దీంతో ఆ బాలుర కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన మనుబోతుల సుమన్ కుమారుడు ధనుష్, కత్తెరపెల్లి బాబు కుమారుడు శివకు ఒకే ఆధార్ నంబర్ (3996 7128 3843) జారీ అయింది.
స్కూల్ లో ఆధార్ డేటా ఎంట్రీ సమయంలో వెలుగులోకి విషయం
ప్రస్తుతం ధనుష్ 4వ తరగతి, శివ 5వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో చేర్పించేటప్పుడు ఇద్దరి ఆధార్ నంబర్లు ఒకటే అన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ బాలురకి సంబంధించి ఆధార్ కార్డును ఉపయోగించే క్రమంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది సాంకేతిక లోపంతో గనుక జరిగి ఉంటే వెంటనే UIDAI హెల్ప్‌లైన్ (1947) లేదా ఆధార్ వెబ్‌సైట్ (uidai.gov.in) ద్వారా ఫిర్యాదు దానిని సవరించే అవకాశం ఉంటుందని ఈ విషయం తెలిసిన అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications