చిన్నోడిని అమెరికా వెళ్లనీయను: కుప్పకూలిన శ్రీనివాస్ తల్లి, బోరున ఏడ్చిన భార్య
అమెరికాలో జాత్యాహంకార కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మల్లంపేటలోని ఆయన నివాస స్థలం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.
హైదరాబాద్: అమెరికాలో జాత్యాహంకార కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. మల్లంపేటలోని ఆయన నివాస స్థలం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.
అంతిమయాత్రలో శ్రీనివాస్ బంధువులు, స్నేహితులు, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికాలో జాత్యాహంకారం నశించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శ్రీనివాస్ భార్యను, తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

కుప్పకూలిన తల్లిదండ్రులు
అమెరికాలో జరిగిన జాత్యంహకార దాడిలో మృతిచెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లితండ్రులు కుప్పకూలి పోయారు. కన్నీరుమున్నీరు అయ్యారు.

నా చిన్న కొడుకును అమెరికా వెళ్లనివ్వను
కూచిభొట్ల శ్రీనివాస్ తల్లి వర్థిని బోరున విలపించారు. ఆమెను ఆపడం ఎవ్వరి తరం కాలేదు. తన చిన్న కుమారుడిని ఇఖ అమెరికా వెళ్లనివ్వను, సాయి కిరణ్ కుటుంబాన్ని హైదరాబాద్ వచ్చేయమని చెప్తానని అన్నారు.

పిల్లలు స్థిరపడ్డారనే సంతోషం..
ఇద్దరు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని ఆనందంగా ఉన్న సమయంలో ఇంత ఘోరం జరిగిందని తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

తిరిగి వచ్చేయమంటే ఇబ్బంది లేదన్న శ్రీనివాస్
ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే తిరిగి వచ్చేయాలని శ్రీనివాస్‌కి చెప్పే దానిని అని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు. ఇబ్బందులు ఏమీ లేవని శ్రీనివాస్ తనకు చెబుతుండేవాడన్నారు.

కంటతడి పెట్టించింది
ఇప్పటికైనా అమెరికాలో ఉండే భారతీయులకు రక్షణ కల్పించాలని తాను కోరుతున్నానని కూచిభొట్ల శ్రీనివాస్ తల్లి విలపించారు. ఆమె విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.

అంత్యక్రియలకు ప్రముఖులు హాజరు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులు తదితరులు శ్రీనివాస్‌కు నివాళులర్పించారు. శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి సమయంలో ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.

బరువెక్కిన గుండెతో..
శ్రీనివాస్ మృతదేహం చూసిన గుండె బరువెక్కింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు విషాదవదనంతో విలపించారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వర్థిని, మధుసూదనరావు కుప్పకూలిపోయారు.

విలపించిన భార్య
శ్రీనివాస్ మృతదేహాంతో పాటు వచ్చిన ఆయన భార్య సునయన బోరున ఏడ్చారు.
మంగళవారం శ్రీనివాస్‌ను కడసారి చూసేందుకు పెద్దయెత్తున ఆయన నివాసానికి పోటెత్తారు.

ట్రంప్‌తో మోడీ మాట్లాడాలి: నారాయణ
అమెరికాలో తెలుగు వారి పైన జరుగుతున్న జాతి వివక్ష పైన ప్రధాని మోడీ స్పందించి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడాల్సిన అవసరం ఉందని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు.

అందరూ వెనక్కి వస్తే వ్యవస్థ కుప్పకూలుతుంది
అమెరికాలో ఉన్న భారతీయులంతా ఒక్కసారిగా వెనక్కి వస్తే అక్కడి వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. అక్కడ ఉన్న తెలుగు సంఘాలు అన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహానికి నారాయణ నివాళులు అర్పించారు.
-
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications