ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెరవేరని డిమాండ్లు: భోజనం చేయకుండా బాసర ఐఐఐటీ విద్యార్థుల ఆందోళన

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆర్జీయూకేటీలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంఛార్జీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. విద్యార్థులు శాంతించలేదు.

సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. మరోవైపు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఆందోళన చేస్తున్నారు. తమ పిల్లలు భోజనం చేయకుండా ఉంటున్నారని, తాము కూడా నిరహార దీక్ష చేస్తామంటున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు కనీస వసతులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

 student protests in Basara IIIT for fulfill their demands

ఇది ఇలావుండగా, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వస్తుండగా బీజేపీ ఎంపీ సోయం బాపురావు ను లోకేశ్వంర మండలంలో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ్నుంచి వెనక్కి పంపేశారు. కాగా, ఓ బీజేపీ నేత కాలుపైకి పోలీసు వాహనం వెళ్లింది. దీంతో అతనికి తీవ్రగామమైంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆర్జీయూకేటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, ఇటీవల ఆర్జేయూకేటీలో కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొందరు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల మెస్ నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయడంతోపాటు నూతన నిర్వాహకులను నియమించి నాణ్యమైన భోజనం అందించాలంటూ ఇంచార్జీ వైఎస్ ఛాన్సలర్ వెంకటరమణకు ఇటీవల విన్నించారు విద్యార్థులు. వీటితోపాటు మరికొన్ని డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని జులై 24వ తేదీలోగా పరిస్కరిస్తామని ఇంఛార్జీ వీసీ భరోసా ఇచ్చారు. అయితే, గడువు ముగిసి ఐదు రోజులైనా డిమాండ్ నెరవేర్చక పోవడంతో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళన బాటపడ్డారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ భోజనం కూడా చేయకుండా ఆందోళన చేస్తున్నారు.

English summary
student protests in Basara IIIT for fulfill their demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X