టీడీపీకి వరుస షాక్‌లు: రేవంత్‌కు రివర్స్, కేసీఆర్ బలం పెంచిన కాంగ్రెస్ నేత!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2019లో తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్థానిక రాజకీయ సమీకరణాలు, వివిధ కారణాలతో చాలామంది నేతలు అటు కాంగ్రెస్‌లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి వెంట కూడా నడవడం లేదు. మరికొందరి టీడీపీ నేతలు అధికార తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

టీడీపీలోకి మాజీ మంత్రులు, రేవంత్ తన్నిపోయాడు, ఊహించలేదు: రమణ ఆసక్తికరం

ఖాళీ అవుతున్న టీడీపీ

ఖాళీ అవుతున్న టీడీపీ

రేవంత్ రెడ్డి రెండు వారాల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అటు రేవంత్ వెంట, ఇటు రేవంత్ వెళ్లిపోవడంతో టీడీపీ పని అయిపోయిందని భావించి మరికొందరు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. దీంతో టీడీపీ ఖాళీ అవుతోంది.

టీడీపీని రేవంత్ దెబ్బతీశారు

టీడీపీని రేవంత్ దెబ్బతీశారు

ఇటీవలి వరకు తెలంగాణలో టీడీపీ అంటే రేవంత్. ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో మాస్ ఫాలోయింగ్ ఉన్న తెలంగాణ టీడీపీ నేత లేరు. దీంతో పార్టీలో భవిష్యత్తు ఉండదని భావించే వారు కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లలో చేరారు.

రేవంత్ రెడ్డి ఊహించినంత ఊపు లేదా?

రేవంత్ రెడ్డి ఊహించినంత ఊపు లేదా?

ఇదిలా ఉండగా, రేవంత్‌తో పాటు 18 మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మరికొందరు దఫాలుగా చేరుతారని భావించారు. కానీ రేవంత్‌కు, కాంగ్రెస్‌కు రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ తర్వాత మిగతా టీడీపీ నేతలు ఎక్కువగా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.

కొడంగల్ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో

కొడంగల్ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో

ఇప్పటికే కొడంగల్ నేతలు ముడు నాలుగు దఫాలుగా తెరాసలో చేరారు. త్వరలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రవీందర్ రావు, మంథని ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ అన్నమనేని నర్సింహ రావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ తదితర జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ నెల 15న తెరాసలో చేరనున్నారు. తాము తెరాసలో చేరుతామని వారు చెప్పారని తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేరి కేసీఆర్ బలం పెంచిన రేవంత్

కాంగ్రెస్‌లో చేరి కేసీఆర్ బలం పెంచిన రేవంత్

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ బలం పెంచారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ బలం కూడా పరోక్షంగా పెంచుతున్నారని అంటున్నారు. టీడీపీలో నేతలు ఎవరూ లేరని భావిస్తూ చాలామంది టీఆర్ఎస్‌లే చేరుతున్నారు. దీనికంతటికీ రేవంత్ కారణం. కాబట్టి పరోక్షంగా ఆయన కేసీఆర్ బలం కూడా క్రమంగా పెంచుతున్నారని అంటున్నారు. 2014 ఎన్నికలప్పటి నుంచి మిగతా పార్టీల నేతల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా తెరాసలో చేరారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కూడా కొందరు చేరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many Telugu Desam Party leaders from Telangana are interested to join TRS after Revanth Reddy join Congress.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి